రాజయ్య తన దోస్తు కొడుకు పెండ్లికి పోయిండు. పెండ్లి మస్తు గ్రాండ్ అయింది. బఫె పెట్టిన్రు. అరవై రకాల వంటలు. లైన్ కట్టి కొన్ని ఐటమ్స్ ప్లేట్ల పెట్టుకొని పోయి నిలవడి తినే సరికి సరిపోయింది. 'గిన్ని తిన్న తృప్తి లేదు రా భయ్... వేస్టు! అప్పట్ల ఇస్తరేసి.. బగారన్నంల రెండు మటన్ ముక్కలేసి పోరా పోసినా.. బాగుంటుండే. ఇప్పుడు ఎన్ని ముక్కలేసినా... ఆ మజా వస్తలేదు' అని పాత రోజులను గుర్తు చేసుకోంగనే నోట్లో నీళ్లు ఊరినయ్. అప్పటి అన్నం కూరే ఆయనకు ఎందుకంత టేస్ట్ అనిపించిందో.. ఆ సీక్రెట్ ఇయ్యాల తెలిసింది!
'ఇస్తరిలో తిన్నందుకేమో' అనుకుంటున్నరు కదా? కాదు! మీరు అన్నం ఎట్ల తింటారు? చెయ్యితోనా... చెంచాతోనా? అని అడగట్లేదు. కూర్చొని తింటారా? నిలవడి తింటారా? నిలవడి ఏం తిన్నా రుచి, పచీ ఉండదంట. కూర్చొని పచ్చడి మెతుకులు తిన్నా. మస్తు టేస్ట్ ఉంటదంట! ఇగ కింద కూసొని తింటే దానికి రెట్టింపు రుచిగుంటదంట! అందుకే రాజయ్యకు ఇస్తరిలో తిన్న అన్నం కూర రుచి ఇంకా మర్చిపోలె. ఈ ముచ్చటే ఇప్పుడు అమెరికా పరిశోధకులు స్టడీ చేసి చెప్పిను. ' అనేది టేస్ట్ ఉండాలంటే కూసాని తినుండ్రి" అని అంటున్నరు వాళ్లు.
"నిలవడి తింటే. ఫిజికల్ సైన్ పెరుగుతది. టేస్ట్ బడ్స్ (రుచి మొగ్గలు) ముడుచుకుపోతాయ్' అని చెప్పిన్రు పరిశోధకులు. జర క్యాలెండర్ని వెనకకు తిప్పితే.. తాతల కాలంల కింద కూసొని తింటుంది. తర్వాత తరం ముక్కాల పీట మీద కూసొని తిన్నది. అక్కడి నుంచి చిన్నగా డైనింగ్ టేబుల్ మీదికొచ్చిను ఇప్పుడు పక్క దేశ పోళ్లని చూసి బఫెకి అలవాటు పడి నిలవడే తింటున్నరు! టేస్ట్ కూడా అటనే తగ్గుకుంట వచ్చింది.
కూర్చొని తింటున్నప్పుడు, నిలవడి తింటున్నప్పుడు రుచికి సంబంధించిన గ్రంథులు ఎట్లా పని చేస్తయో పరిశోధకులు పసిగట్టిను. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్గా పని చేస్తున్నది ప్యాన్ బిస్వాస్ దీనికి నేతృత్వం వహించిండు. ఈ కథంతా జర్నల్ ఆఫ్ కంజ్యూమర్ రీసెర్చిలో పబ్లిష్ అయింది.