Food Special : కూల్ వెదర్ లో మిరియాల పులిహోర.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్ కు టేస్ట్..!

కావాల్సినవి: 

  • బియ్యం - ఒక కప్పు 
  • నీళ్లు - రెండు కప్పులు 
  • చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజంత
  •  పచ్చిమిర్చి - మూడు
  •  ఎండు మిర్చి- నాలుగు 
  • నల్ల మిరియాలు- ఒకటిన్నర టీస్పూన్
  •  శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్ 
  • మినపప్పు - ఒక టేబుల్ స్పూన్ 
  • పల్లీలు - మూడు టేబుల్ స్పూన్లు 
  • బెల్లం పొడి - ఒక టీస్పూన్ 
  • పసుపు - అర టీస్పూన్ 
  • ఇంగువ - చిటికెడు 
  • కరివేపాకులు - రెండు రెమ్మలు 
  • నూనె - మూడు టేబుల్ స్పూన్లు 
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ: 

బియ్యం శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్ లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చింతపండును నీళ్లలో పదినిమిషాలు నానబెట్టి గుజ్జు పిండాలి. నల్ల మిరియాలను నూనె వేయకుండా వేగించి, చల్లారాక మిక్సీజార్లో వేసిపొడి పట్టాలి. అన్నాన్ని వెడల్పాటి బేసిన్లో పరిచి చల్లార్చాలి. పాన్లో నూనె వేడిచేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీ గింజలు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులు వేసి కొంచెం సేపు వేగించాలి. ఇందులో చింతపండు గుజ్జు, బెల్లం, పసుపు, నల్లమిరియాల పొడి వేసి బాగా కలిపి ఉడికించాలి. నూనె పైకి తేలాక స్టవ్ మంట ఆపేయాలి. అరబెట్టిన అన్నంలో ఉప్పు వేసి కలిపి అందులో ఉడికించిన మిశ్రమాన్ని వేసి కలిపితే మిరియాల పులిహోర రెడీ.