ఆహారమే.. ఆరోగ్యం..

ఆయుర్వేదం ప్రకారం ఫుడ్​ని మూడు కేటగిరీలుగా చెప్తారు. అవి... సాత్విక్​, రాజసిక్, తామసిక్​. ఈ మూడు రకాల ఆహారాలు మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే వీటి గురించి బేసిక్​ విషయాలు తెలుసుకుంటే  ఏ ఫుడ్​ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తెలుస్తుంది. 

సాత్విక్​ డైట్​
 

సాత్విక్(సత్వ)  డైట్​ అంటే తేలికైన, పోషకాలు నిండిన ఫుడ్​. ఈ ఫుడ్​లో ఏ రుచి అయినా  ఎక్కువగా ఉండదు. అంటే మరీ తియ్యగా, ఉప్పగా, కారంగా అన్నమాట. సింపుల్​గా చెప్పాలంటే మనసుకి ప్రశాంతతను ఇచ్చి, శరీరాన్ని  శుభ్రపరిచేది ఈ సాత్విక్​ డైట్. ఈ డైట్​లో ప్రాసెస్​ చేయని ఫుడ్​ ప్రాణ(లైఫ్​ ఫోర్స్​)ను కలిగి ఉంటుంది. దానివల్ల శరీరం, మనసు రెండూ కొత్త శక్తితో నిండిపోతాయి. ఈ ఆహారం వండడం, తినడం మూడు నుంచి నాలుగు గంటల్లో పూర్తవుతుంది. 
 

సాత్విక్​ ఎందుకు?
 

సాత్విక్​ ఫుడ్​ మనల్ని మానసికంగా, శారీరకంగా మంచిగా ఉండేలా చేస్తుంది. శరీరం, మనసు మధ్య సమతుల్యతను ఉంచుతుంది. క్రమం తప్పకుండా సాత్విక్​ డైట్​ను తీసుకుంటే బాడీ టిష్యూస్​ రిపేర్​ అవుతాయి. డెవలప్ అవుతాయి కూడా.

సాత్విక్​  ఫుడ్స్​ ఇవి...

    బియ్యం, గోధుమలు, ఓట్స్​, పప్పు దినుసులు​, పెసలు
    తాజా ఆకుపచ్చని కాయగూరలు అంటే పాలకూర, గ్రీన్​ (ఫ్రెంచ్​)బీన్స్​, మసాలా 
దినుసులతో ఉడికించిన కాయగూరలు
     దానిమ్మ, యాపిల్​, అరటి, ఆరెంజ్​, ద్రాక్ష వంటి తాజా పండ్లు
    తాజా పండ్ల, కాయగూరల జ్యూస్​లు
     తాజా లేదా దోర​గా వేగించిన గింజలు, నట్స్​ 
     తాజా  మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి. తాజా పాలు కూడా సాత్విక​ ఆహారం కిందకే వస్తాయి. కానీ ఒకసారి వీటిని పాశ్చరైజ్​(శుద్ధి) చేస్తే అవి తామసిక్​ ఫుడ్​ కిందకు వస్తాయి.
     కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్​ నూనె
     అల్లం, యాలకలు, దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు, పసుపు వంటి మసాలాలు
     తేనె, బెల్లం, ముడి చక్కెర

తామసిక్​ డైట్​

మైదా, పేస్ట్రీ, పిజ్జా, బర్గర్​, చాకొలెట్స్, సాఫ్ట్​ డ్రింక్స్​, నాన్​, టీ, కాఫీ, చైనీస్​ ఫుడ్​, పొగాకు, ఆల్కహాల్​తో పాటు క్యాన్డ్​, ప్రిజర్వ్​డ్​ ఫుడ్స్​ వంటి జామ్​, పచ్చళ్లు, ఫర్మెంటెడ్​ ఫుడ్స్​ తామసిక్(తామస్​)​ డైట్​ కిందకు వస్తాయి. ఇవేకాకుండా పకోడీ వంటి వేపుళ్లు, పంచదారతో చేసే స్వీట్స్, ఐస్​క్రీమ్స్​, పుడ్డింగ్స్​ కూడా ఉంటాయి.  అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ... ఎంజాయ్​ చేసే ఫుడ్స్​లో చాలావరకు తామసిక్​ డైట్​ కిందకు వస్తాయి. ఇందులో కారం, ఉప్పు, తీపి, కొవ్వు ఉన్న పదార్థాలన్నీ ఉంటాయి. తామసిక్​ క్యారెక్టరస్టిక్​ ఏంటంటే అతిగా తినడం.

తింటే ఏమవుతుంది?

బుర్ర మబ్బుగా ఉంటుంది. గందరగోళం, చుట్టు పక్కల పరిస్థితులతో అంటీముట్టనట్టు ఉంటారు.  వండి నిల్వ ఉండేవి,  వేడిచేసుకుని తినేవి, బాగా నూనె ఉండేవి లేదా తింటే పొట్టలో భారంగా అనిపించేది ఈ తామసిక్​ ఫుడ్​​. ఇవన్నీ ఫేక్​ ఫుడ్స్​ అన్నమాట. ఇలాంటివి తినడం వల్ల కోపం, హింసా ప్రవృత్తి పెరుగుతుంది. 

తామసిక్​ ఫుడ్స్​ ఇవి...

    మాంసం, చేప, తెల్లని పిండి, నిల్వ ఉంచిన ఆహారం, రాత్రి నిల్వ ఉన్న ఫుడ్​.
     అధికంగా స్టార్చ్​ ఉన్న, క్యాన్డ్​, టిన్డ్​ ఫుడ్​
    విస్కీ, రమ్​ వంటి హార్డ్​ లిక్కర్​
     తెల్లటి చక్కెర, తెల్లటి పిండి
     చల్లని, పాశ్చరైజ్​ పాలు, పెరుగు, చీజ్​
     ఫ్రెంచ్​ ఫ్రైస్​, డిప్స్​, ఉప్పు వేసి నిల్వ ఉంచిన పదార్థాలు
    ఫ్యాట్స్​, ఆయిల్స్​, షుగర్స్​, పేస్ట్రీస్​

రాజసిక్​ డైట్​

రాజసిక్​ (రాజస్​) అన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పులు(మొలకలు కావు), కాయగూరలు, ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, చేప, చికెన్​, మాంసం వంటివి వస్తాయి. ఈ ఆహారంలో మనుక కావాల్సినవన్నీ లభిస్తాయి. ఈ డైట్​ను అప్పటికప్పుడు వండుకుని తింటారు.

తింటే ఏమవుతుంది?

ఈ ఆహారం తింటే శరీరంలో పిత్త, వాత లేదా ఇతర దోషాలు పెరుగుతాయి. ఈ ఆహారం శరీరానికి, మనసుకు శక్తిని ఇస్తుంది. ఈ ఫుడ్​ ఎక్కువగా తింటే హైపరాక్టివిటీ, రెస్ట్​లెస్​నెస్, కోపం, చిరాకు, నిద్రలేమి వంటివి వస్తాయి. రక్తంలో వ్యర్ధాలు పెరుగుతాయి. రాజసిక్ ఫుడ్​ తినడానికి టేస్టీగా ఉంటుంది. 

రాజసిక్​ ఫుడ్స్​ ఇవి...

    మాంసం, చేప, మసాలాలు, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉన్నవి.
    ఘాటైన కాయగూరలు, ఆలుగడ్డ, క్యాబేజీ, బ్రొకోలి, కాలీఫ్లవర్​ ఎక్కువగా తినడం.
     జామ్​, జెల్లీ, ఫ్లేవర్డ్​, ప్రిజర్వ్​డ్​ ఫుడ్స్​
    వైన్స్​, ఆల్కహాలిక్​ డ్రింక్స్​, సోడా, కోలా, కాఫీ
     వేపుళ్లు. వేగించిన, ఉప్పు నిండిన ఆహారం, ఆవాలు.
     పుల్లటి పాలు, మీగడ
     మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చళ్లు, వెనిగర్​
     బ్రౌన్​ లేదా బ్లాక్​ చాకొలెట్​