కరీమాబాద్ కివి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్

ఖిలావరంగల్(కరీమాబాద్), వెలుగు : ఎస్ఆర్ఆర్ తోట కరీమాబాద్ లోని కివి స్కూల్ లో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసి సతీశ్​ మూర్తి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలు వంటలు నేర్చుకోవడం వల్ల వంటకాలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు.

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కివి పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ అన్నదేవర ప్రవీణ్​ కుమార్, పాఠశాల డైరెక్టర్ దాసి రజనీ, అధ్యాపకులు రవితేజ, రంజిత పాల్గొన్నారు.