కాకా సేవలు ఆదర్శనీయం: పెద్దపల్లి కాంగ్రెస్​ నేతలు

పెద్దపల్లి పార్లమెంటరీనియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి,మంథని నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో కాకా అభిమానులు, కాంగ్రెస్​ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన శిబిరాలు.. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.  పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల మందికి అన్నదానం చేయగా.. 200 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు.. కాకా అభిమానులు రక్తదానం చేశారు.  తెలంగాణకు కాకా చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.