మసాలా దోశ టాప్.. తర్వాతి ప్లేస్​లో వడ, ఇడ్లీ, పొంగల్ 

  •     దేశంలోని టాప్ టెన్ బ్రేక్‌‌‌‌ఫాస్ట్ లో నాలుగు దక్షిణాదివే 
  •     ముంబై దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీకీ క్రేజ్ 
  •     ఆర్డర్స్ ఆధారంగా టాప్ ఫుడ్స్ వెల్లడించిన స్విగ్గీ

న్యూఢిల్లీ : దేశ ప్రజలు సౌతిండియా బ్రేక్‌‌‌‌ఫాస్ట్ నే ఎక్కువగా తింటున్నారు. టాప్ టెన్ బ్రేక్‌‌‌‌ఫాస్ట్ ఐటెమ్స్ లో మొదటి నాలుగు దక్షిణాదివేనని ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ వెల్లడించింది. ఏడాదిలో వచ్చిన ఆర్డర్‌‌‌‌ల ఆధారంగా స్విగ్గీ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం..సౌతిండియాకు చెందిన మసాలా దోశ, వడ, ఇడ్లీ, పొంగల్ ను దేశంలోని ఎక్కువ మంది ప్రజలు తింటున్నారు.

స్విగ్గీ యాప్ లో జనం మసాలా దోశ, వడ, ఇడ్లీ, పొంగల్ నే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అందులోనూ మసాలా దోశకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని బ్రేక్‌‌‌‌ఫాస్ట్ నేగాక.. లంచ్, డిన్నర్‌‌‌‌కి కూడా తింటున్నారు. మొత్తం బ్రేక్‌‌‌‌ఫాస్ట్ ఆర్డర్లల్లో 90 శాతం వెజిటేరియన్ ఆర్డర్లే ఉంటున్నాయి. గతంతో పోలిస్తే వెజ్ బ్రేక్‌‌‌‌ఫాస్ట్ ఆర్డర్లు 146 శాతం పెరిగినట్లు స్విగ్గీ పేర్కొంది. వారానికి 60 వేల వెజ్ సలాడ్ ఆర్డర్‌‌‌‌లు వస్తున్నాయని..అందులోనూ గ్రీన్ సలాడ్‌‌‌‌నే కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్‌‌‌‌ చేస్తున్నారని వివరించింది. 

బ్రేక్‌‌‌‌ఫాస్ట్ హాట్‌‌‌‌స్పాట్ గా సౌతిండియా

బ్రేక్‌‌‌‌ఫాస్ట్ కు సౌతిండియా హాట్‌‌‌‌స్పాట్ గా మారిందని స్విగ్గీ తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్  కు చెందిన మసాలా దోశ, ఇడ్లీలకు ఫుల్ క్రేజ్ ఉందని వెల్లడించింది. తమిళనాడులోని బెంగళూరు "వెజ్జీ వ్యాలీ" గా మారిపోయిందని చెప్పింది. అక్కడ మసాలా దోశ, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్లు ఎక్కువ వస్తాయని వివరించింది. ముంబైలో దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీల కోసం ఆర్డర్స్ భారీగా వస్తాయని పేర్కొంది. ప్రజలు ఎక్కువగా తినే స్నాక్స్ గురించి కూడా స్విగ్గీ తన సర్వేలో వెల్లడించింది. స్నాక్స్ గా మార్గరీటా పిజ్జా అత్యంత ప్రజాదరణ పొందిదని తెలిపింది. సమోసా, పావ్ భాజీలను కూడా జనం సాయంత్రం వేఈఈళ ఎక్కువగా ఆరగిస్తున్నారని వివరించింది. 

బెస్ట్ వెజ్ ఫుడ్ కు 'గ్రీన్ డాట్ అవార్డ్'

దేశంలో మంచి ఫుడ్ అందించే రెస్టారెంట్లకు పలు కంపెనీలు అవార్డులు అందజేస్తున్నాయి. ఐపీఓ బౌండ్ అనే కంపెనీ దేశవ్యాప్తంగా బెస్ట్ వెజ్ ఫుడ్ ను సెలక్ట్ చేసి 'గ్రీన్ డాట్ అవార్డును' అందిస్తున్నది. అందుకోసం దేశంలోని 80 సిటీల్లో ఫేమస్ వెజ్ రెస్టారెంట్‌‌‌‌లను సెలక్ట్ చేస్తుంది. వాటినుంచి కేకులు, డెజర్ట్‌‌‌‌లు, వెజ్ పిజ్జా, వెజ్ బర్గర్, పన్నీర్ వంటకాలు, వెజ్ బిర్యానీ, దాల్ మఖానీతో సహా 60 కంటే ఎక్కువ విభాగాల్లో 9వేల బ్రాండ్‌‌‌‌లు సేకరిస్తుంది. అందులో బెస్ట్ ఫడ్ ఎంపిక చేసి గ్రీన్ డాట్ అవార్డుతో సత్కరిస్తున్నది. జొమాటో లిమిటెడ్ కూడా 'రెస్టారెంట్ అవార్డ్స్' అందిస్తున్నది. అందుకోసం ఇష్టమైన రెస్టారెంట్‌‌‌‌లకు ఓటు వేయాలని ప్రాంతాల వారీగా కస్టమర్లను కోరుతున్నది.