Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?

సరైన ఆహారపు అలవాట్లు ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చని అందరికీ తెలుసు. కానీ సరైన ఆహారం అంటే ఏంటి..? ఎవరికి ఎలాంటి ఆహారం సూట్ అవుతుంది. ఇటీవల చేసిన ఓ సర్వేలో మనిషి బ్లడ్ గ్రూప్‎ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని వెల్లడైంది. గ్రూపులను బట్టి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ''ఏ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు. బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు నాన్ వెజ్‎కు దూరంగా ఉంటే మంచిది.ఇంకా వీళ్లు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్,గింజలు, చిరుధాన్యాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 'బి' గ్రూప్ వాళ్లకు మెటబాలిజం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ALSO READ | Health tips:బరువు తగ్గాలనుకుంటున్నారా..6 బెస్ట్ డ్రింక్స్

 అందుకే ఆకుకూరలు, గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. కార్న్, టొమాటాలు, గింజలు, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే వీళ్లు కొవ్వు,నూనె పదార్థాలు, ఆల్కహాల్ను వాడక పోవడం మంచిది. 'ఏబీ' గ్రూప్ వాళ్ల జీర్ణాశయంలో యాసిడ్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే యాసిడ్ పదార్థాలను ఎక్కువగా ఉండే యాపిల్, మునగ, తేనె, ఆకుకూరలు,చేపలు పాలు వంటివి తీసుకుంటే మంచిది. 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీళ్లు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

.. వెలుగు, లైఫ్