పండ్ల రంగు మారకుండా ఉండాలంటే..?

యాపిల్ లాంటి కొన్ని పండ్లను కోసినప్పుడు స్మూత్ గా, ఆకర్షణీయంగా ఉంటుంది.కానీ కోసిన కొద్దిసేపటికే రంగు మారిపోతుంది. దీంతో వాటిని అతిథులకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

నీళ్లలో తరగడం

 నల్లా ఆన్ చేసి ఆ నీటి మధ్యలో పండ్లను ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపొచ్చు. దీని వల్ల పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి. 

అల్లం ద్రావణం:

కట్ చేసిన పండ్లను అల్లంద్రావణం (అల్లం రసం, నిమ్మరసం, కొద్దిగా సోడా కలిపినమిశ్రమం)లో వేసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్ గా కనిపిస్తాయి.

ఉప్పు నీళ్లు:

ఇది అన్నింటికంటే సులభమైన ప్రక్రియ. ఒక గిన్నెలో నీళ్లు, అర టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. అందులో కోసిన పండ్ల ముక్కలను వేసి రెండు నిమిషాల తర్వాత తీయాలి. దీనివల్ల పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి. 

హనీ వాటర్

తేనె నీటి ద్వారా కూడా పండ్ల రంగు మారకుండా అరికట్టొచ్చు. గోరు వెచ్చని నీళ్లలో ఒక టేబుల్' స్పూన్ తేనె వేసి కలపాలి. అందులో పండ్ల ముక్కలు వేసి... 30 సెకన్ల తర్వాత బయటకు తీయాలి. ఇలా చేస్తే సుమారు ఎనిమిది గంటల వరకు పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.