6 నెలల్లో నీళ్లొచ్చే ప్రాజెక్టులపైనే ఫోక స్ పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి

  • ఐదారేండ్లు పట్టే వాటిపై ఖర్చు చేస్తే లాభం ఉండదు : సీఎం రేవంత్​
  • త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు గ్రీన్ చానెల్ ద్వారా బిల్లుల చెల్లింపు
  • భూసేకరణ, ఇతర సమస్యలను పరిష్కరించండి
  • పూడికతీతపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని సూచించారు. రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఐదారేండ్లయినా పూర్తికాని ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి నిధులు ఖర్చు చేస్తే లాభం ఉండదన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్​లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని

అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ప్రాధాన్య ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టుల్లో పూడికతీతపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికల్లా రూ.5,700 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ చానెల్​ ద్వారా బిల్లులను చెల్లించాలని సూచించారు. 

సమస్యలుంటే పరిష్కరించుకోండి..

ప్రాజెక్టుల పూర్తికి అడ్డుగా మారిన సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖతో కొన్ని బిల్లుల చెల్లింపుల సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే ట్రాన్స్​కో, జెన్​కో, డిస్కంలతో ఇరిగేషన్​ శాఖ అధికారులు జాయింట్​మీటింగ్​ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖతోనూ సమావేశం కావాలన్నారు. ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతో యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకోవాలని సూచించారు. 

పనులు చేపట్టాక భూసేకరణ నిలిచిపోయిందన్న సమస్య రాకుండా చూసుకోవాలని, కొనసాగుతున్న ప్రాజెక్టులన్నింటికీ ముందుగా భూసేకరణ చేయాలని చెప్పారు. భూసేకరణ విషయంలోనూ మానవీయత ఉండాలని, భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు. ఇంజనీర్లు ఆఫీసుల్లో ఉండే కుదరదని, ఐఏఎస్​అధికారుల నుంచి ఇంజనీర్లదాకా అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. ఫీల్డ్​ విజిట్ చేస్తేనే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయన్నారు. అనంతరం అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కాగా, చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు, లోయర్ పెన్ గంగా, చనాకా కొరాటా

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కోయిల్ సాగర్ లిఫ్ట్, కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్, ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్, ఎస్సారెస్పీ 2, సదర్మాట్ బ్యారేజ్, నీల్వాయి, పాలెంవాగు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల వారీగా పురోగతి, ఎన్ని నిధులు కావాలనే వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. 

పూడికతీతపై అధ్యయనం.. 

రాష్ట్రంలోని మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో పూడికతీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జరుగుతున్న పనులను అధికారులు వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో సగటున 25 శాతం పూడిక, ఇసుక మేటలు ఉన్నాయని ఇటీవల ఒక ఏజెన్సీ అధ్యయన నివేదికలో వెల్లడయిందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా వివరించారు.

పూడికతీతపై జాతీయ పాలసీని అన్వయం చేసుకునే ముందు మరోసారి సాధ్యాసాధ్యాలు, ఏయే పద్ధతులను అనుసరించాలి? వాటితో ఉండే లాభనష్టాలను మరోసారి బేరీజు వేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఈఎన్సీ అనిల్​కుమార్ పాల్గొన్నారు.