నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!

నల్గొండ జిల్లాలో  ఫ్లోరోసిస్ లక్షణాలు కలకలం రేపుతున్నాయి.  మర్రిగూడ మండలానికి చెందిన గర్భిణీలో ప్లోరైడ్ లక్షణాలు కల్పించాయి. దీంతో  యూరిన్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపారు డాక్టర్లు. రిపోర్టుల తర్వాత గర్భిణీలో కనిపించినవి  ఫ్లోరోసిస్ లక్షణాలా కాదా నిర్ధారణ కానుంది. 

ALSO READ | నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే

ఓ మహిళలో లక్షణాలుకనిపించడంతో మండలంలోని  అన్ని గ్రామాల్లో ఏఎన్ఎంలు   ప్లోరైడ్ సర్వే చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 39,700 జనాభా, ప్రతి ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు ఏఎన్ఎంలు. వ్యవసాయ పనుల్లో భాగంగా అక్కడి బోరు నీరు తాగడం వల్ల, అక్కడ పండించే ఆహారం తీసుకోవడం వల్ల మళ్ళీ ప్లారోసిస్  వ్యాపిస్తుందా అనే అంశంపై అధ్యాయం చేస్తున్నారు డాక్టర్లు.