శ్రీశైలం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ వరద

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్ట్‌‌లో  1,02,286 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8070 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 875 (163.5820) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ద్వారా 49,234 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు.