వర్షం ఎఫెక్ట్: డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు

కామారెడ్డి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి..మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండ వర్షాలు పడుతుండటంతో జిల్లాలో పలు గ్రామాలు వరద ముంపు గురయ్యా యి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి..వాగులువంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.వదలకుండా కొడుతున్న వానలతో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. 

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంం రామేశ్వరపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. డబుల్ బెడ్ రూంఇండ్లు నిర్మించిన ప్రాంతంలో మోకా ల్లోతు నీళ్లు నిలిచాయి. డబుల్ బెడ్ రూం కాలనీ మొత్తం చెరువును తలపించింది. డబుల్ బెడ్ రూం భవన సముదాయాల చుట్టూ వరద నీరు చేరడంతో ఎటూ వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది.

ALSO READ | తెలంగాణలో సెప్టెంబర్ 2 న అన్ని విద్యా సంస్థలకు సెలవు

వరదలతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించేవారిని పోలీసులు స్థానికులతో కలిసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.