శ్రీరాం సాగర్ కు 20వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి సోమవారం 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.దీంతో ప్రాజెక్టు నీటి మట్టం ఆశాజనకంగా మారుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు (80.50 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు లో 1068.20 అడుగులు (20.51 టీఎంసీల)నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు.గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1079.10 అడుగులు (42.53టీఎంసీల)నీరు నిల్వ ఉందని రికార్డులు తెలుపుతున్నాయి.