నిజామాబాద్​ కలెక్టరేట్​లో ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో పాటు అడిషనల్​ కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐఏఎస్​ కిరణ్మయి, డీఆర్డీఓ సాయాగౌడ్ లకు విన్నవించుకున్నారు. పెండింగ్​అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్​అధికారులకు సూచించారు.

కామారెడ్డి టౌన్:  ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​పేర్కొన్నారు.  సోమవారం ఆయన కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఏరియాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 72 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అడిషనల్​కలెక్టర్ చంద్రమోహన్, జడ్పీ సీఈవో చందర్​నాయక్, జిల్లా ఆఫీసర్లు రాజారాం, దయానంద్,  శ్రీనివాస్,  సింహారావు పాల్గొన్నారు.