నిజామాబాద్​లో ఫ్లాగ్ మార్చ్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో సోమవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వన్ టౌన్ నుంచి ప్రారంభమైన కవాతు ప్రధాన వీధుల గుండా నెహ్రూ పార్క్, బస్టాండ్, ఓల్డ్ కలెక్టరేట్, గంజి కమాన్ వరకు కొనసాగింది. ఎన్నికల్లో ఎటువంటి భయాందోళనలకు కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ ఏపీసీ రాజా వెంకటరెడ్డి, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ విజయ్ బాబు ఆధ్వర్యంలో  కేంద్ర సాయుధ బలగాలతో ఈ కవాతు నిర్వహించారు.