ఇరువైలో ఆరోగ్యం చాలా కీలకం

లైఫ్ లో సెట్ అయ్యే ఏజ్ అంటే పాతికేళ్ల అనే చెప్పారు. సరిగ్గా 20  నుంచి 30 ఏళ్ల మధ్య  హెల్తీగా ఉండటం చాలా కీలకం. మంచి ఫుడ్ తో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. ఎడ్యూకేషన్, కెరీర్, ఫ్యామిలీ, లవ్ అంటూ చాలా ప్రాబ్లమ్స్ ఆ ఏజ్ లో చుట్టుముడతాయి. ఇరువై ఏళ్లప్పుడు మానసక సమస్యలు అనుభవిస్తే అది మీ పూర్తి జీవితంపై ప్రభావితం చూపుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వయస్సులో ఆరోగ్యంగా ఉండాలంటే సింపుల్ గా ఈ 5 టిప్స్ ఫాలోకండి.
బాడీ ఫిట్ కోసం వ్యాయామం
శరీరం ఫిట్ గా ఉంచుకునేందుకు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మజిల్స్ కదిలేలా ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి. యోగా, డ్యాన్స్, ఏరోబిక్స్, జిమ్, గేమ్స్, రన్నింగ్ లాంటివి అలవాటు చేసుకోవాలి.
గుడ్ ఫుడ్ 
కొలెస్టాల్, షుగర్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవద్దు. ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను అవైడ్ చేయండి. బెస్ట్ న్యూట్రీషన్ వ్యాల్యూస్ ఉండే ఆహారాన్ని భోజనానికి ముందే ప్లాన్ చేసుకోండి.

ALSO READ :- రైతులకు గుడ్​న్యూస్​:  పంటనష్ట పరిహారం అడ్వాన్స్​ గా రూ. 23కోట్లు

తగినంత నిద్ర
రోజుకు 9 నుంచి 7 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి అనేక అనారోగ్య  సమస్యలకు దారితీస్తుంది. కచ్చితంగా పడుకోవడానికి అంటూ ఓ ఫిక్స్‌డ్ షెడ్యూల్ పెట్టుకోవాలి.
స్ట్రెస్ మ్యానేజ్‍మెంట్ 
ఒత్తిడిని మేనేజ్ చేయడానికి మంచి సంగీతం వినండి, పదే పదే ఆందోళనగా అనిపించే విషయాలకు దూరంగా ఉండండి. డీప్ బ్రీత్,  యోగా, ధ్యానం చేయండి. వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్, ఫ్యామిలితో సమయాన్ని గడపండి.
హైడ్రేటెడ్ గా ఉండాలి
వెదర్ కండిషన్ ని బట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. లేదంటే వీలైనంత తక్కువ ఆల్కహాల్ తీసుకోవడానికి ట్రై చేయండి.