పంచేంద్రియాల ఎక్సర్​సైజ్​ చాలా ముఖ్యం

స్పర్శ, చూపు, వినికిడి, వాసన, రుచి... పంచేంద్రియాలు అనే ఫైవ్​ సెన్సెస్. చిన్న పిల్లల్లో బ్రెయిన్​ పవర్​ బాగుండాలని ఫైవ్​ సెన్సెస్​కు సంబంధించిన ఎక్సర్​సైజ్​లు ప్రత్యేకంగా చేయిస్తుంటారు. పెద్దవాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఫైవ్ ​సెన్సెస్​ ఎక్సర్​సైజ్​ చాలా ముఖ్యం అంటున్నారు సైకియాట్రిస్ట్​, ఆక్యుపేషనల్​ థెరపిస్ట్​లు. 

పిల్లలనే కాదు వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్లు మానసికంగా ఆరోగ్యంగా, మెరుగ్గా ఉండాలంటే ఈ ఐదు ఇంద్రియాలను తెలివిగా వాడాలన్నది థెరపిస్ట్​లు చెప్తున్నమాట. సెన్సరీ యాక్టివిటీల వల్ల స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇది మెడికల్ ట్రీట్​మెంట్​లో ఒక భాగమైంది. ఒకటి రెండు ప్రయోజనాలు కాదు బోలెడన్ని లాభాలు ఉన్నాయి. స్ట్రెస్​ మేనేజ్​మెంట్​, యాంగ్జైటీ, మానసికంగా ఎదురయ్యే   ఛాలెంజెస్​ ఎదుర్కోవడం వంటివి వాటిలో కొన్ని. సెన్సరీ ఎక్సర్​సైజ్​లను  వ్యక్తిగత అవసరాలను, ప్రాధాన్యతలను బట్టి ఎవరికి వాళ్లే తయారుచేసుకోవచ్చు. వాటిని రెగ్యులర్​గా ఫాలో అయిన చాలామందిలో మంచి ఫలితాలు కనిపించాయని సైకియాట్రిస్ట్​లు చెప్తున్నారు.

ఇలా మొదలు...

స్పర్శ, వాసన, చూపు, రుచి, వినికిడి... వీటి యాక్టివిటీల​ మీద దృష్టి పెడితే బుర్రలోకి చొచ్చుకు వచ్చే ఆలోచనలను తప్పించొచ్చు. ఒత్తిడిని తగ్గించొచ్చు. బుద్ధిని మెరుగుపరుచుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మల్టి సెన్సరీ ఎంగేజ్​మెంట్​ అనేది జీవితం వెనక పరుగులు పెడుతున్న వాళ్లని వర్తమానంలో నిలిచేలా చేస్తుంది. అలా ఉన్నారంటే... జరిగిపోయిన సంగతుల గురించి, జరగాల్సిన వాటి గురించి తెగ ఆలోచించి బుర్ర మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం రాదు. ప్రశాంతత సొంతం అవుతుంది. మానసికంగా స్పష్టత ఉంటుంది. అటువంటి స్పష్టత, ప్రశాంతత ఇప్పుడున్న స్పీడ్ అండ్​ స్ట్రెస్​​ కాలానికి చాలా అవసరం కదా!

ఎన్నెన్నో లాభాలు...

సెన్సరీ యాక్టివిటీల వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. స్ట్రెస్​ లెవల్స్​ తగ్గిపోయి, మైండ్​ ప్రశాంతంగా ఉండటం కంటే కావాల్సింది ఏముంటుంది. మూడ్​ బాగాలేదు అనేమాట దరిదాపులకు రాని జీవితం ఎంత బాగుంటుంది?! మనసు తేలికగా, ఆహ్లాదకరంగా ఉండటం కంటే గొప్ప ఆస్తి ఏముంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తంగా హెచ్చుతగ్గులు లేకుండా భావోద్వేగాలు కంట్రోల్​లో ఉంటాయి. మానసికంగానే కాకుండా శారీరకంగా పడే టెన్షన్​ల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. స్పష్టత, ఏకాగ్రతలు మెరుగుపడతాయి.  ఉదాహరణకి కలరింగ్​ బుక్స్​లో​ రంగులు నింపి చూడండి బుర్ర మీద దాడి చేసే ఆలోచనలు తగ్గిపోవడం మీకే తెలుస్తుంది. 

ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు

అయితే ఈ సెన్సరీ యాక్టివిటీల వల్ల కొన్ని తెలియని ఇబ్బందులు ఉంటాయి.  అయితే ఆ ఇబ్బందుల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటి గురించి అవగాహన ఉండాలి. అప్పుడు ఇబ్బందులు దరిచేరకుండా చేసుకోవచ్చు. అవేంటంటే... ఎక్కువగా ఉత్తేజం కావడం. కొన్ని రకాల సెన్సరీ యాక్టివిటీల వల్ల ఎక్కువ భారంగా అనిపించడం. వీటినుంచి బయటపడేందుకు ఉత్తేజపరిచే యాక్టివిటీలకు బదులు ఓదార్పునిచ్చే యాక్టివిటీలు చేయాలి. 
కొన్ని సందర్భాల్లో కొన్ని మెటీరియల్స్​ అందుబాటులో ఉండవు. అది కూడా సమస్యగానే ఉంటుంది. అలాగని చేసేపనిని ఆపేయొద్దు.  ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న సింపుల్​ ఐటమ్స్​తో సెన్సరీ యాక్టివిటీలు​ చేయొచ్చు. మరో పెద్ద అడ్డంకి పరధ్యానం. చేస్తున్న  పని మీద కాకుండా ఇతర విషయాలపైకి మనసు మళ్లడం. వేరువేరు ఆలోచనలు రావడం.

అలాగే ఒక రోజు చేసి మరో రోజు ఆపేయడం వల్ల సెన్సరీ యాక్టివిటీల వల్ల కలిగే ప్రయోజనాలు అందవు. మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేసే చాలారకాల పను​ల్లో స్థిరంగా, నిలకడగా పనిచేసుకుంటూ వెళ్లడం చాలా ముఖ్యం. సెన్సరీ యాక్టివిటీలు చేసేందుకు స్పెషల్​గా ఒక టైం పెట్టుకోవాలి. అలా చేయగలిగినప్పుడు అనవసరపు ఒత్తిడులు, కోపాలు, ఉద్వేగాల బారిన పడకుండా సాఫీగా జీవితాన్ని గడిపేయొచ్చు.

జీవితంపై మార్పు

సెన్సరీ యాక్టివిటీల వల్ల ఒత్తిడిని మేనేజ్​ చేసే సామర్థ్యం పెరుగుతుంది. నేలమీద నిల్చొని ఆలోచించేందుకు,  వర్తమానంలో జీవించేందుకు ఈ యాక్టివిటీలు చాలా సాయం చేస్తాయి. అలాగే క్రియేటివిటీ మెరుగుపడుతుంది. దాంతో రొటీన్​లో పడి కొట్టుకుపోకుండా జీవితంలో సరదాలను నింపుకోవచ్చు. సృజనాత్మకత, తర్కజ్ఞానం వంటివి పెరుగుతాయి.

సెన్సరీ యాక్టివిటీల కోసం..

  •     ఫన్​ లెర్నింగ్​ టాయ్స్, పజిల్​ బుక్స్​​, కలరింగ్​ బుక్స్ 
  •     యాక్టివిటీ స్ట్రెస్​ బాల్స్​ వంటి టెక్చర్డ్​ ఆబ్జెక్ట్స్​
  •     లావా ల్యాంప్​ లేదా వైబ్రెంట్​ రంగులతో ఆర్ట్​  
  •     ఎసెన్షియల్​ ఆయిల్స్​ లేదా సెంటెడ్​ క్యాండిల్స్​తో అరోమాథెరపీ 
  •     బేకింగ్​, పెట్​ థెరపీ, ఆర్ట్​ థెరపీ, మ్యూజిక్​ థెరపీ, గార్డెనింగ్​, మసాజ్... వంటివి.