సూర్యాపేటలో రెచ్చిపోయిన దొంగలు కత్తులతో బెందిరించి చోరి

సూర్యాపేట జిల్లా : ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి చోరికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా- వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి కత్తులతో బెదిరించారు. ఏడు తులాల బంగారం, రూ.50వేల నగదు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, ASP  నాగేశ్వరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు.