ఈ దివాళికి ఐదు బెస్ట్ గిఫ్ట్స్ : రూ.10వేలలోపే.. ట్రై చేయండి

దివాళి పండుగ వచ్చేసింది. ఈ పండగంటేనే స్వీట్లు, బహుమతులు. ఈసారి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరికైనా మంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే వీటివైపు ఓ లుక్ వేయండి. ఇవి యూస్ ఫుల్ యే కాకుండా సరసమైన ధరకు కూడా వస్తాయి. ఈ ఐదు ఎలక్ట్రానిక్ గార్జెట్స్ మీ ప్రియమైన వారి బాగా నచ్చుతాయి. పదివేల లోపే ఐదు బెస్ట్ డీల్ గిఫ్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రీమ్ పాకెట్ హై-స్పీడ్ హెయిర్ డ్రైయర్ :

పాకెట్ హై-స్పీడ్ హెయిర్ డ్రైయర్ లేడీస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. పండుగ టైంలో ఇంట్లోనే సెలూన్ లోగా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. ఈ డ్రైయర్ 110,000 RPM మోటార్‌తో రూ.7999లకే Amazonలో అందుబాటులో ఉంది.

పవర్ బ్యాంక్ 

పోర్ట్రోనిక్స్ బూస్టీ 5K పవర్ బ్యాంక్ లెటెస్ట్ మొబైల్ ఫోన్ల కోసం తయారు చేయబడింది. ఇది 5,000 mAh బాటరీ సామర్థ్యంతో వస్తుంది. 15W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 20W టైప్- C ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తోంది. ఇది 30 నిమిషాల్లోనే 50శాతం ఛార్జ్ చేయగలదు. ఇది Amazonతో పాటు ఇతర ఆన్‌లైన్ స్టోర్‌లలో కూడా రూ.2,151కే లభిస్తోంది. 

సోనీ ఇయర్‌బడ్స్

మ్యూజిక్ లవర్స్ కు ఇది మంచి డీల్ అనే చెప్పాలి. సోనీ WF-C510 ఇయర్‌బడ్‌లు డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్, ఛార్జింగ్ కేస్‌తో 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్, IPX4 వాటర్ రెసిస్టెన్స్, ఫాస్ట్ పెయిరింగ్ సపోర్ట్, క్లియర్ కాల్స్ కోసం బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, మల్టీపాయింట్ కనెక్షన్‌తో వస్తాయి. సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ తో ఇయర్ బడ్స్ లింక్ చేసుకోవచ్చు. ఇవి రూ.3,990కి లభిస్తాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో దొరుకుతాయి.

ఐటెల్ A50 స్మార్ట్ ఫోన్

ఆండ్రాయిడ్ 14 OSలో రన్ అవుతున్న ఐటెల్ A50 ఇండియాలోనే బెస్ట్ ప్రైజ్ స్మార్ట్ ఫోనుల్లో ఒకటిగా నిలిచింది. 3GB ర్యామ్ బేస్ మోడల్ రూ.6,099, 4GB ర్యామ్  రూ.6,499 లకు ఆ ఫోన్ వస్తోంది. స్లిమ్ డిజైన్, అట్రాక్టీవ్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ ఉన్నాయి. ఎవరికైనా దివాళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ గిఫ్ట్. 

ఇన్ఫినిక్స్ హాట్ 5జీ ఫోన్

పదివేల లోపే ఓ మంచి 5జీ ఫోన్ లభిస్తోంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ పండగకు బహుమతి ఇవ్వాలంటే ఈ ఫోన్ ఇచ్చేయండి. ఇన్‌ఫినెక్స్ హాట్ ఫిఫ్టీ 5జీ ఫోన్ ధర రూ.9,999. ఇది స్లిమ్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, మంచి పర్ఫమెన్స్, లాంగ్ లైఫ్ బ్యాటరీతో వస్తోంది. ఇది బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తోంది.