అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజున ( మే 10)  బంగారాన్ని కొనడం చాలా శుభప్రదం. అయితే బంగారంతో పాటు మరికొన్ని శుభప్రదమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున కొనే ఇతర వస్తువులు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే(May) 10న అక్షయ తృతీయను రానుంది. ధన దేవత (లక్ష్మీదేవత) ప్రసన్నం కోసం ఈ పర్వదినం నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు, శ్రేయస్సు తీసుకొస్తుందని చాలా మంది నమ్మకం. అయితే బంగారం, వెండి కొనడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవారు వీటిని కొనలేరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ధన దేవత ఆశీస్సులు లభిస్తాయి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిద్దాం.

1. బంగారం(Gold): బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు. అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు. ఈ కారణంగా  అక్షయ తృతీయ రోజున  బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు, ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీ వద్దనే ఉంటుంది.. దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధించి ఉంది.  బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత, పూజ చేసి, ఆ బంగారు నాణెం లేదా ఆభరణాలను లక్ష్మీ దేవికి  లార్డ్ కుబేరునికి సమర్పించాలి.

2. కొత్త ఇల్లు కొనడం ( New House purchasing): హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసం తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నెల 10 వ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేసినా కచ్చితంగా విజయం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన కొందరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, లేదా కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, కుటుంబ సభ్యుల పురోగతి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతారు.

3. కొత్త వాహనం ( New Vehicle): అక్షయ తృతీయ రోజు ( మే 10) వాహనాలు.. కారు, బైక్ వంటి వాహనాలను కొనుగోలు చేయడానికి   మంచి రోజు. ఆటోమొబైల్ కంపెనీలు ఆకర్షణీయమైన డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అక్షయ తృతీయ నాడు అనేక నగరాల్లో కొత్త కార్ల రిజిస్ట్రేషన్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు వాహనం కొనుగోలు చేయడం వల్ల రక్షణ, విజయం లభిస్తాయని ప్రజల విశ్వాసం.

4. వెండి ( Silver) వస్తువులు.. వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం మంచింది. వెండి పాత్రలు, నాణేలు, ఆభరణాలపై పెట్టుబడి పెట్టడానికి శుభకరం. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది శుభ సందర్భం. వెండి నాణం లక్ష్మీదేవికి చిహ్నం. అక్షయ తృతీయ రోజున వెండి నాణానికి పూజ చేసి .. మీ ఇంట్లో డబ్బును భద్రపరచే లాకర్​ లో ఉంచితే అంతా మంచి జరిగి సంపద అభివృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు. 

5. మట్టికుండ (Pot):ధనంతులు బంగారు, వేడితో చేసిన కుండలను అక్షయ తృతీయకు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఖరీదైన వాటిని కొనలేని వారు మట్టికుండను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ నాడు మట్టికుండా కొంటే లక్ష్మీ దేవీ ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదలు కలుగుతాయి.