చేపతో జాలరి దేవీదాస్​ 25 కిలోల భారీ చేప

ఆర్మూర్​, వెలుగు: నిజామాబాద్ ​జిల్లా ఆర్మూర్​ మండలం చేపూర్​ ఊర చెరువులో 25 కిలోల  భారీ చేప చిక్కింది. సోమవారం జాలరి దేవీదాస్ చేపలు పడుతుండగా వలలో పడింది.  ఇంత బరువు చేప చిక్కడం అరుదని.. ఇది బొచ్చ రకానికి చెందినదని దేవీదాస్ ​చెప్పారు.