Shravana Masam 2024:  మొదటి శ్రావణ శుక్రవారం ... ఇలా పూజ చేయండి...

శ్రావణమాసం మొదలైంది.   మొదటి శుక్రవారం ఆగస్టు9న . శ్రావణమాసం వరలక్ష్మివ్రతం చేసుకోవడం ఎంత విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగిఉంటుంది. శ్రావణమాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యం  పెట్టాలి.  అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో  తెలుసుకుందాం. . 

శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసం ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీమహాలక్ష్మిని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందుకే శ్రావణమాసంలో  ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించండి.. మొదటి శ్రావణ శుక్రవారం  ఆగస్టు 9  వ తేదీన వస్తుంది. 

ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి.లక్ష్మీ అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు. అయితే లక్ష్మీ అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు. అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి. అమ్మవారిని, విగ్రహాన్ని మీ శక్తికొలది పూలు, నగలు వేసి అలంకరించుకోవాలి. పూజచేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు, గాజులు, పసుపు పెట్టుకుని ఉండాలి. ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి. కొత్త బట్టలైతే మరీ మంచిది. కొత్తవి కుదరని పక్షంలో పీరియడ్స్​ సమయంలో వాడని దుస్తులు వేసుకోండి. 

శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు, కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి. తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి. కొత్తవస్తువులు ఏవి తీసుకున్న పూజలో పెట్టండి. గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి. అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి. అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి. ధనలక్ష్మి కుంచం ఉంటే ఏర్పాటు చేసుకోండి. మొదటిరోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకుల మాల వేస్తే అప్పులబాధలు తీరతాయి. ఇవి 9,11,21 మాలగా కుచ్చి వేయాలి. కాసులమాల ఏదైన ఉంటే వేసుకుని అలంకరించుకోండి.

అమ్మవారి  కామాక్షీదీపం ఉంటే పెట్టండి. ఈ దీపాన్ని కూడా ప్లేటులో బియ్యం, తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి. అంతేకాదు ఈరోజు ఐశ్వర్యదీపం అంటే ఉప్పుదీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పుదీపం పెట్టుకోండి. ఒక ప్రమిదలో నెయ్యివేసి ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాదిపొడిని పూజలో చల్లుకోండి. ఇప్పుడు పూజను దీపారాధాన ఏకహారతితో మొదలు పెట్టండి.

ఏ పూజ చేసిన ముందుగా వినాయకుడికి పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుంచి వస్తున్న ఆచారం.  అందుచే మొదట విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించి.... ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి.  అమ్మవారి దీపం వద్ద పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు వేసి నమస్కారం చేసుకోవాలి.  అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. శుద్ధజలంతో అభిషేకం వేసి ధూపం వేయాలి. ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు.  ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. విగ్రహం లేనినారు కాయిన్స్ కు కూడా పూజచేయవచ్చు.

ఇప్పుడు అమ్మవారి పాదాలవద్ద అక్షితలు, పూలు, కుంకుమ వేస్తూ  సహస్రనామాలు, స్వామివారి నామాలను జపించుకోవాలి. ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి. మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు.. ఆరోజు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచార్యం పాటించండి. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మివ్రతం చేసుకుంటాం. 

ప్రతీవారం కలశం పెట్టుకుంటే మరుసటిరోజు కదిలించండి. అమ్మవారివద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి. ఆ తర్వాత 9 యాలకులు కూడా అందులో వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయండి. అధికఖర్చులు తగ్గుతాయి. అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి. ప్రతీవారం శనగలు పెట్టాలి. దీంతోపాటు పాలు, వీటితో చేసిన నైవేధ్యంగా పెట్టాలి. కొబ్బరికాయను నివేదన చేయాలి. అమ్మవారికి మీ కష్టలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు చేయాలి. అక్షితలు, పూలు  చల్లండి. ఇక పూజలో పెట్టిన డబ్బులు, యాలకులు మరుసటిరోజు బీరువాలో దాచుకోండి. యాలకులను పర్సు, హ్యండ్ బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి.