అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్​ స్పేస్​వాక్​

ప్రైవేట్​రంగ అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్​ తొలిసారి అంతరిక్షంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్​ సెంటర్​లో ఫాల్కన్​–9 రాకెట్​ను వినియోగించి ఆగస్టు 26న ప్రైవేట్​ స్పేస్ వాక్​ను నిర్వహించనున్నది. ఈ ప్రాజెక్టు పోలారిస్ డాన్ గా పేరుపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను స్పేస్​ఎక్స్​ క్రూ డ్రాగన్​ క్యాప్సుల్​ సాయంతో భూకక్ష్యలోకి పంపనున్నారు.

ఈ మొత్తం మిషన్​కు వ్యాపారవేత్త జేర్డ్​ ఇస్సాక్​మన్​ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్​ఫోర్స్​ మాజీ ఉద్యోగి స్కాట్​ కిడ్​ దీనికి పైలట్​గా వ్యవహరిస్తారు.ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్​) సమీపంలో ఆగదు. కానీ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి భూ ప్రదక్షిణ చేయనున్నది.

గతంలో అపోలో మిషన్లు మాత్రమే మానవులను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆ తర్వాత మరేతర ప్రాజెక్టులు మానవులను ఇంత ఎత్తుకు తీసుకెళ్లలేదు. పోలారిస్​ మిషన్​లో తలపెట్టిన మూడు మానవ సహిత యాత్రల్లో ఇది మొదటిది.ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్​ఎక్స్​ పరికరాలనే వినియోగిస్తారు. మూడు యాత్రలకు ఇస్సాక్​మన్​ నిధులను సమకూరుస్తున్నారు.