పరిశుభ్రత గురించి పురాణాల్లో ఏముంది.. దేవుడి తర్వాత స్థానం శుభ్రతదే..

చాలామంది ఇంటి పరిసరాలు.. ఇంట్లోఎలా ఉన్నాకాని.. స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుంటారు.  శుభ్రంగా (Clean) లేకుండా అలా ఉంటే ఏ మాత్రం ఉపయోగం ఉండదని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.  అంతేకాదు ఇంట్లో.. ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోతే  ఏంజరుగుతుంది.. పండితులు.. పూర్వీకులు.. పురాణాలు   ఈ విషయంలో ఏంచెప్పాయో తెలుసుకుందాం. . . 

భగవంతుని ఆరాధించేందుకు కేవలం స్నానంతో శుద్ది అయితే సరిపోదని పురాణాల ద్వారా తెలుస్తుంది.  శుభ్రత విషయంలో కొన్ని ఆధ్యాత్మిక కథలు కూడా ఉన్నాయి.  పరిసరాలు శుభ్రంగా లేకపోతే అక్కడ ఎవరు ఉండాలన్నా .. చిరాకుగా ఫీలవుతారు.. ఎప్పుడు అక్కడ నుంచి బయట పడతామా అనుకుంటారు.  అలానే దేవుడి మందిరం.. దేవుడుపటాలు ఉండే పరిసరప్రాంతంతో పాటు మనం నివసించే ఇల్లు కూడా  నీట్​ గా ఉంచుకోవాలి.  

హైటెక్ యుగంలో బిజీ బీజీ లైఫ్​లో ఇంటి శుభ్రత గురించి కొంతమంది పట్టించుకోవడం లేదు.  ఎక్కడ పడితే అక్కడ ఏవస్తువు.. పడితే ఆ వస్తువు పడేస్తున్నాం.. కాని పొద్దున్నే దేవుడి పటాలున్న ప్రదేశానికి వెళ్లి.. మొక్కుబడిగా దండం పెట్టి రెండు అగర్​ బత్తీలు వెలిగిస్తాం..కాని ఆ ప్రదేశం ఎలా ఉంది.. మన ఇల్లు ఎలా ఉంది అసలు ఆలోచించం. ఇల్లు నీట్​ గా లేకుండా భగవంతుడిని ప్రార్థి ఎలాంటి ఉపయోగం లేదని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.  దీనికి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక కథలను కూడా పండితులు వివరించారు. 

కథలెన్నో..

నలదమయంతుల కథలో శుభ్రత గురించి వివరంగా ఉంది. కలి పురుషుడు తను పెళ్లి చేసుకోవాలనుకున్న దమయంతిని నలుడు చేసుకోవడంతో అతడిపై పగ పెంచుకుంటాడు. కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. కానీ నలుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతాడు. అయితే ఒకరోజు నలుడు కాళ్లు సరిగా శుభ్రం చేసుకోడు. దాంతో కలి పురుషుడు అతడిని పట్టుకుంటాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలై నలుడు భార్యా, పిల్లలకు సైతం దూరమవుతాడు.

మరో కథలో.. కశ్యప ప్రజాపతికి దితి, అదితి అనే ఇద్దరు భార్యలు.అయితే అదితి కొడుకులు దేవతలు... దితి కొడుకులు రాక్షసులుగా ఉంటారు. యుద్ధంలో తన కొడుకులు ఎప్పుడూ ఓడిపోవడాన్ని తట్టుకోలేక దితి భర్తతో ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని వరం అడుగుతుంది. కశ్యపుడు వరం ఇస్తూ...అన్ని వేళలా శుభ్రం పాటించకపోతే గర్భం పోతుందని చెప్తాడు. ఇంద్రుడు దీతికి సేవలు చేస్తూ గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు సంధ్యవేళ దితి కాళ్లు, చేతులు కడుక్కోకుండా నిద్రపోతుంది. దాన్ని ఆసరా చేసుకుని ఇంద్రుడు సూక్ష్మరూపంతో గర్భంలోకి వెళ్లి, విచ్ఛిన్నం చేస్తాడు. తన తప్పు తెలుసుకున్న దితి, తనకు పుట్టబోయే బిడ్డ నీవు చెప్పినట్టే వింటాడని, చంపొద్దని ఇంద్రుడిని వేడుకుంటుంది. ఇంద్రుడు ఒప్పుకుంటాడు.  ముక్కలైన దితి గర్భంలోంచి ఒక్కో ముక్క ఒక్కో బిడ్డగా పుడుతుంది.

పురాణాల్లో శుభ్రత గురించి ఏముందంటే

శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడే  లక్ష్మీదేవి ఉంటుదని.. లక్ష్మీ దేవినే  అదృష్ట దేవతగా భావిస్తారు. కానీ ఆ అదృష్టం రావాలంటే శుభ్రంగా ఉండాలి. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో వివరించారు. అలా వివరించే క్రమంలో ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మి కొలువై ఉంటుందని చెప్తారు. బలం, ఆరోగ్యం, సంతోషం, ఆయుష్షు... లాంటివన్నీ శుభ్రత వల్లే వస్తాయి. గుడిలో దేవుడిని కూడా భక్తుల దర్శనానికి ముందు స్నానం చేయించి, వస్త్రాలు చుట్టి, అలంకరిస్తారు. అంటే శుభ్రత లేనిచోట దేవుడు ఉండడని ఇట్టే అర్థమవుతుంది.

దేవుడు తమను రక్షించాలని, కష్టాలు రాకుండా కాపాడాలని భక్తులు పూజలు చేస్తారు. అందుకు ముందు ఇంట్లోని ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకోకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే.. శుభ్రం లేనిచోట దేవుడు ఉండడు. ఇది కేవలం భక్తులకే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం  అని సంతోషంగా ఎవరు బతకాలన్నా ఇవి పాటించాలి.

దేవుడి తర్వాతి స్థానం శుభ్రతదే..

శుభ్రంగా ఉన్న మనసు, శరీరం ఏవైనా సాధిస్తాయి. లక్ష్యంవైపు నడిపిస్తాయి. జీవితంలో అద్భుతాలు సాధించేందుకు ఉపయోగపడతాయి. మనసును శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని స్కందోపనిషత్తు చెప్తుంది. భగవద్గీతలో కృష్ణుడు శుభ్రత గురించి అర్జునుడికి వివరించాడు. శుచిగా ఉండటమే జ్ఞానం అంటాడు. శరీరం శుభ్రంగా లేకపోతే.. మనసుపై చాలా ప్రభావం చూపుతుంది. దాంతో మనసు మంచిగా ఆలోచించలేదు. ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. శుభ్రత అనేది ఒక తపస్సులాంటిదేనని కృష్ణుడు అంటాడు. భక్తుడు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో... అలాంటి ప్రాధాన్యతే శుభ్రతకు కూడా ఇవ్వాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే అందులో ఉన్న మనసు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే శరీరం, ఆరోగ్యం రెండూ శుభ్రత విషయంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇవి రెండూ శుభ్రంగా ఉంచుకోగలిగిన వాళ్లేపరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతారు.మనసు బాగా లేనప్పుడు ఏ పనీ చేయబుద్ధికాదు. అందుకే ముందు మనసులో ఉన్న మలినాన్ని కడిగేయాలి.

శుచిగా శుభ్రంగా ఉండడం అంటే... అదేదో ప్రత్యేకమైన పనేం కాదు. రోజువారీ జీవితానికి సంబంధించిందే. ఆచారం అంతకంటే కాదు. ధర్మం లాంటిది మాత్రమే. ముఖ్యంగా ప్రవర్తనకు సంబంధించింది. నడత సరిగా ఉంటే శుభ్రత దానంతట అదే అలవాటవుతుంది. ఆడంబరంగా ఉంటే శుభ్రంగా ఉన్నట్లు కాదు. నాలుగైదు రకాల ఫెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే శుభ్రంగా ఉన్నట్లు కాదు. రోజూ ఇల్లంతా తుడిచి, అందంగా అలంకరించుకుంటే సరిపోతుందనుకుంటే కుదరదు. అవన్నీ చేయాలంటే ముందు మనసు శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే అది శంకరాచార్యులు బయట శుభ్రత కంటే లోపలి శుభ్రత ముఖ్యం అన్నారు. అంటే మనసు మురికిగా ఉండి, బయటకు ఖరీదైన బట్టలేసుకుని, ఏసీ కార్లలో తిరిగితే శుభ్రంగా ఉన్నట్లు కాదు. గుడికి వెళ్లాలనుకున్న రోజు తొందరగా నిద్రలేచి, స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుంటారు. గుడికి వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుంటారు. కానీ మనసును మంచి విషయాల మీద పెట్టకుండా అవన్నీ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఈ స్నానాలు చేయాల్సిందే..

  • రోజూ నిద్రలేవగానే స్నానం చేయడం ప్రతి ఒక్కరూ చేసే పనే. కానీ శాస్త్రాలు ఐదు రకాల స్నానాలు చెప్పాయి. శుభ్రత కోసం ఇవి చేస్తే ఆరోగ్యంగానే కాదు అన్నివిధాలా శుభ్రంగా ఉంటారనీ చెప్పాయి.  మనసులో ఉండే ద్వేషం, స్వార్థం, అసూయ లాంటి చెడు గుణాలు పోయేలా ఎప్పటికప్పుడు మనసుకు స్నానం చేయించాలి.
  •  కపటంగా కాకుండా ధర్మంగా...బతుకుతూ, కల్లాకపటంలేకుండా..రోజువారీ జీవితాన్ని గడపాలి. 
  •  ఇతరులు అసహ్యించుకునేలా నీచమైన పనులు చేయకుండా మంచి బుద్ధి ఉండేలా రోజూ  స్నానం చేయాలి. 
  •  మాట కూడా శుభ్రంగా ఉండాలి. అంటే.. ఏదిపడితే అది కాకుండా, అబద్ధాల జోలికి పోకుండా, మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి.