చాలామంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నిజంగా మొదటిసారి చూడడం. మొదటిసారి కలపడం, మొదటిమాట... ఇవి తర్వాతి బంధానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి మొదటిసారి కలిసే వ్యక్తులతో చాలా మర్యాదగా, హుందాగా వ్యవహరించాలి.
- కొత్తవాళ్లను పలకరించేటప్పుడు చిరునవ్వు చాలా అవసరం. కేవలంఎంతవరకు అవసరమో అంతవరకే ముక్తసరిగా మాట్లాడటం కంటే ఇష్టాలు, అభిప్రాయాలు చర్చిస్తే వాళ్లకు గుర్తుంటారు. మరోసారి కలిసినప్పుడు మళ్లీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
- మొదటి పరిచయంలోనే గొప్పలు చెప్పకోవటం, గర్వంప్రదర్శించడం పనికిరాదు. అలాగని తమని తాము తక్కువ చేసుకోమని కాదు. స్థాయికి తగ్గట్లు ప్రవర్తిస్తూనే ఎదుటి వాళ్ల మనసును ఆకర్షించాలి.
- టైం చాలా విలువైంది. ఎవరినన్నా కలుస్తానని చెప్పినప్పుడు తప్పకుండా సమయానికి వెళ్లాలి. వెయిట్ చేయించకూడదు.
- అర్జెంట్ పనులేమైనా అడ్డుపడి.. అనుకున్న సమయానికి వెళ్లలేమని తెలిస్తే వెంటనే వాళ్లకు కారణం తెలియజేయాలి. క్షమించమని అడగాలి. తర్వాత ఎప్పుడు. కలుస్తామో కూడా కచ్చితంగా చెప్పాలి.
- విందులు వినోదాలకు వెళ్లినప్పుడు అందర్నీ పలకరించాలి. అక్కడి మర్యాదలు పాటించాలి. వీలైనంత వరకు ఫోన్ మాట్లాడకపోవడమే మంచిది.
-వెలుగు, లైఫ్-