ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రూప్​ 3 పరీక్ష తొలి రోజు ప్రశాంతం

కరీంనగర్​/పెద్దపల్లి/ జగిత్యాల టౌన్,  వెలుగు :  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  ఆదివారం గ్రూప్​3 పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది.  కరీంనగర్​ జిల్లాలో మొత్తం 26,41 5 మంది అభ్యర్థులకు  ఉదయం సెషన్ కు 14,104(53.39 శాతం) మంది మాత్రమేహాజరుకాగా 12,311 మంది ఆబ్సెంట్ అయ్యారు. మధ్యాహ్నం   14,009(53.03 శాతం) మందిమాత్రమే హాజరు కాగా 12,406 మంది ఆబ్సెంట్ అయ్యారు.  

 అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తిమ్మాపూర్ లో  శ్రీచైతన్య, వాగేశ్వరి, విట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని ట్రినిటీ కాలేజీ, భగవతి హై స్కూల్, ఫండుస్ హై స్కూల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్  పరీక్షా కేంద్రాలను సందర్శించారు.   పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 8,947 మంది అభ్యర్థులకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.    కలెక్టర్​ శ్రీహర్ష  పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

 ఆదివారం ఉదయం జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 4557 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4390 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.  మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4440 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4507 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ పెద్దపల్లి శాంతి నగర్ లోని ట్రినిటీ డిగ్రీ కళాశాల, రామగిరి లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాలలో   తనిఖీ చేశారు.    

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 10656 మందికి ఉదయం 5544 మంది హాజరుకాగా 5112 మంది ఆబ్సెంట్ అయ్యారు. మధ్యాహ్నం 5563 మంది హాజరు కాగా 5093 మంది గైరాజరయ్యారు. సుల్తానాబాద్ లోని శ్రీవాణి డిగ్రీ కాలేజీ సెంటర్ లో రెండు, మూడు నిమిషాలు లేటుగా వచ్చిన ముగ్గురు క్యాండెట్స్ ను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు.