కామారెడ్డి పాస్ పోర్ట్ ఆఫీస్లో అగ్నిప్రమాదం.. ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధం

కామారెడ్డిలో అగ్నిప్రమాదం జరిగింది. 2024, ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తా దగ్గర ఉన్న తపాలా శాఖ కార్యాలయం అవరణలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో పాస్ పోర్ట్ కార్యాలయం మొత్తం మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పివేశారు.  షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.