కొండాపూర్​ తండాలో అగ్ని ప్రమాదం

లింగంపేట,వెలుగు:  లింగంపేట మండలం కొండాపూర్​ తండాలో బుధవారం మధ్యాహ్నం షార్ట్‌ సర్య్కూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి రెండు నివాస గుడిసెలు, ఒక పశువుల కొట్టం కాలిపోయింది. తండాకు చెందిన మంజబద్యా, మంజపర్తాల్ కు చెందిన గుడిసెలు కాలిపోగా 60 తులాల వెండి, అర తులం బంగారు ఆభరణాలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ​ ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.