కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి బైక్ కోసం లోన్ తీసుకున్నాడు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించి మరో రూ. 15 వేలు ఫైనాన్స్ కంపెనీకి బాకీపడ్డాడు వంశీ.
తీసుకున్న అప్పుకు ఈఎంఐలు చెల్లించాలని లోన్ అధికారులు వంశీ ఇంటి వద్దకు వచ్చి వేధించారు. దీంతో మనస్థాపానికి గురైన వంశీ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ గురించి సమాచారం తెలుసుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా దోమకొండ పోలీసులు.