Chicken Tips : ముక్కలు, బొక్కలు ఉంటేనే పండుగ.. చికెన్ ఫ్రై, యాట కూర ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

దసరా వచ్చిందంటే.. ఇంటికో యాట తెగాల్సిందే అంటారు పెద్దలు, అవును మరి, ఊళ్లో పెద్దోళ్లు అయితే నాలుగు గంటలకే లేచి యాటను కోయించి, ఇంటికి కూర తెస్తారు. యాటమాంసం కూర ఒక్కటే కాదు... తలకాయ, కాళ్లను కాల్చి కూర చేసి ఆనందంగా తింటారు. పండుగరోజు యాటకూర, కోడికూర వండుకుని పండుగ చేసుకోండి.  సింపుల్​ గా వాటని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . 

చికెన్​ ఫ్రై తయారీకి కాలవసినవి

  • చికెన్​– కిలో
     
  • ఉల్లిగడ్డ పేస్ట్​– ఒక టేబుల్​ స్పూన్​ 
  • పచ్చిమిర్చి తరుగు– రెండు టీ స్పూన్లు
  • అల్లం.. వెల్లుల్లి పేస్టు– రెండు టేబుల్​ స్పూన్లు
  • పసుపు ‌– అర టీస్పూన్​
  • కారం– రుచికొ సరిపడా
  • గరం మసాలా - ఒకటీస్పూన్​
  • పెరుగు–ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)
  • నూనె - సరిపడా
  • ఉప్పు- తగినంత
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ విధానం: చికెన్ ముక్కల్లో ఉప్పు పసుపు. కొద్దిగా నూనె, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ పట్టించి20 నిమిషాలు పక్కన పెట్టాలి. వెదల్పాటి పాన్​ లో ఈ చికెన్​ ముక్కలు వేసి నీరంతా ఆవిరూ చికెన్​ సగం ఉడికే వారకు స్టవ్​ మీద  ఉంచి తర్వాత పాన్ దింపేయాలి. మరో గిన్నెలో నూనె వేసి చికెన్ ముక్కలు, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి సన్నని మంటపై వేగించాలి. చికెన్ పూర్తిగా వేగడానికి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. తరువాత గరం మసాలా, కొత్తమీర తరుగు చల్లితే టేస్టీ చికెన్ ఫ్రై రిడీ

యాట కూర తయారీకి కావలసినవి

  •  మటన్- ముప్పావు కేజీ 
  • పెరుగు - నాలుగు టీస్పూన్లు (కావాలంటే)
  •  ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
  •  కారం- రుచికి సరిపడా
  • పసుపు-చిటికెడు
  • ఉప్పు - తగినంత
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు
  • లవంగాలు– నాలుగు 
  • ఇలాచీలు-రెండు 
  • దాల్చినచెక్క - కొద్దిగా
  •  గరం మసాలా- అర టీ స్పూన్ 
  • ఉల్లిగడ్డ తరుగు (వేగించి)- రెండు టీస్పూన్లు
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు 
  • నూనె - సరిపడా

తయారీ విధానం: స్టవ్ పై గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్  వేగిన తరువాత మటన్ , పెరుగు, ఉప్పు, నీళ్లు, దనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి . కావాలంటే  మసాలాలు (లవంగాలు, దాల్చిన చెక్క ఇలాచీలు) వేసి సన్నని మంటపై అరగంట ఉడికించాలి. తరువాత ఉల్లిగడ్డ తరుగు వేసి, మటన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. కూర దగ్గరికయ్యాక ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి, కూర త్వరగా ఉడకాలంటే కుక్కర్లో వండొచ్చు

తలకాయ కూర తయారీకి కావలసినవి

  • తలకాయ మాంసం- పావు కేజీ
  •  ఉల్లిగడ్డ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
  •  ఉల్లిగడ్డ పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
  •  టొమాటో తరుగు- రెండు టేబుల్ స్పూన్లు లేదా చింతపండు రసం -ఒక టేబుల్ స్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
  •  అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • పసుపు‌‌– అరటీ స్పూన్​
  • కారం‌‌– రుచికి సరిపడా
  • గరం మసాలా– ‌‌ఒక టీ స్పూన్
  • ఉప్పు–తగినంత
  • కొత్తిమీర తరుగ–పావుకప్పు
  • నూనె–సరిపడా

తయారీ విధానం: తలకాయ మాంసంలో పసుపు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి 10  నిమిషాలు ఉడికించి దింపేయాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరుగు, పసుపు వేయాలి. అవి గాక అల్లం- వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ టొమాటో తరుగు లేదా చింతపండు రసం చేసి రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు ఉడికించిన మాంసం( కుక్క ర్లో మిగిలిన నీళ్లతో పాటు) కలిపి చిక్కబడేవరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి దింపేయాలి

కోడికూర తయారీకి కావలసినవి

  • కావాల్సినవి: చికెన్ కిలో
  • ఉల్లిగడ్డ తరుగు-పావు కప్పు
  • టొమాటో తరుగు - పావుకప్పు
  • పచ్చిమిర్చి తరుగు - రెండు టీస్పూన్లు
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు 
  • కారం - రుచికిసరిపడా
  • ఉప్పు- తగినంత
  • పసుపు - చిటికెడు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ -రెండు టేబుల్ స్పూన్లు
  •  గరం మసాలా- ఒక టీ స్పూన్ 
  • ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
  • నూనె - సరిపడా

తయారీ విధానం  : స్టవ్​ పై పాన్​ పెట్టి  నూనె వేడి చేయాలి . అందులో ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ -పసుపు వేయాలి. తర్వాత చికెన్ ముక్కలు వేయాలి. ఐదు నిమిషాల తర్వాత టొమాటో తరుగు, ఉప్పు, కారం వేసి కలపాలి. ముక్కలు కొంచెం వేగాక కొన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. కూర దగ్గరికయ్యాక గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి

కాళ్ల షోర్వా తయారీకి కావలసినవి

  • మేక లేదా పొట్టేలు కాళ్లు –నాలుగు
  •  ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్
  •  టొమాటో తరుగు - పావు కప్పు
  •  అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
  •  ధనియాల పొడి- ఒక టీ స్పూన్
  • పసుపు--పావు టీ స్పూన్
  •  నూనె - రెండు టేబుల్ స్పూన్లు
  •  కొత్తిమీర తరుగు- పావు కప్పు
  • దాల్చిన చెక్క- కొద్దిగా
  • బిర్యానీ ఆకు-ఒకటి 

తయారీ విధానం :  కాళ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత కుక్కర్లో నూనె వేడి చేసి, ఉల్లిగడ్డ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. కాళ్ల ముక్కలతో పాటు నాలుగు కప్పుల నీళ్లు పోసి, కొత్తిమీర తరుగు కూడా వేసి ఎనిమిది నుంచి వది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ మూత తియ్యకుండా అలానే రెండు గంటలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం. వల్ల ఎముకల రసం కూరలోకి దిగుతుంది. మళ్లీ స్టవ్ పై గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో లవంగాలు. బిర్యానీ ఆకు దాల్చిన చెక్కను వేగించాలి. తర్వాత కాళ్ల షోర్వా పోసి దింపేయాలి

–వెలుగు, లైఫ్​–