OTT MOVIES..ఆలోచింపజేసే కథలు

ఆలోచింపజేసే కథలు 

టైటిల్ : లాంత్రణి

డైరెక్షన్​ : గుర్వీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారిక, కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంగూలి

కాస్ట్ : జితేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జానీ లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిమిషా సంజయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిషు సేన్​గుప్తా, సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహానంద్

లాంగ్వేజ్ : హిందీ 

ప్లాట్​ ఫాం : జీ5

ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు కథలు చూపించారు. ఆ మూడు కథలను ముగ్గురు నేషనల్ అవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్స్ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మొదటి కథ ‘హుద్ హుద్ దబాంగ్’తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది. కథలోకి వెళ్తే.. ఒక పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జానీ లివర్) 25 ఏండ్ల పాటు డెస్క్ డ్యూటీలో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఖైదీని కోర్టుకు తీసుకెళ్లే పని అప్పగిస్తారు. అందుకోసం అతనికి లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తుపాకీ, బుల్లెట్ ఇస్తారు. కానీ.. కోర్టుకు వెళ్లే మార్గంలో జరిగిన పరిణామాలు ఖైదీ పట్ల అతని ఆలోచనను మార్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఖైదీని కోర్టుకు తీసుకెళ్లాడా? లేదా? అనేది కథ. దీన్ని కౌశిక్ గంగూలీ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే బెస్ట్ స్టోరీ. ఇందులో కామెడీ కూడా బాగానే ఉంది. రెండో కథ.. ‘ధర్నా మనా హై’. ఇందులో జితేంద్ర కుమార్, మలయాళ నటి నిమిషా సజయన్ నటించారు. నిమిష ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళగా నటించింది. మొదటిసారి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపిక అవుతుంది ఆమె. కానీ.. అధికారం మాత్రం ఆమెకు ఇవ్వరు. దాంతో ‘‘నాకు అధికారం ఇవ్వాలి.  పక్షపాతం చూపించొద్దు” అని పోరాటం మొదలుపెడుతుంది. తన భర్తతో కలిసి డీడీఓ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు నిరసన చేసేందుకు రెడీ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. గుర్వీందర్ సింగ్ ఈ స్టోరీని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మూడో కథ ‘శానిటైజ్డ్ సమాచార్’. ఇది కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక పనికిరాని స్థానిక వార్తా ఛానెల్ కథ. దాని స్టార్ యాంకర్ కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాడు. దాంతో ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు డబ్బులు ఉండవు. అలాంటి టైంలో ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘కోవినాష్’ అనే స్పాన్సర్ రూపంలో ఒక అవకాశం వస్తుంది. అది ఒక హ్యాండ్ శానిటైజర్. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. దీన్ని భాస్కర్ హజారికా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

ఆ హోంలో ఏం జరుగుతోంది? 

టైటిల్: భక్షక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డైరెక్షన్​: పుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాస్ట్ : భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిశ్రా, సాయి తమంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిత్య శ్రీవాత్సవ 

లాంగ్వేజ్: హిందీ 

ప్లాట్​ ఫాం: నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వైశాలి (భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పట్నాలోని మునావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రీలాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంటుంది. తను సేకరించిన వార్తలను తన సొంత యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘కోశిష్ న్యూస్’లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటుంది. ముఖ్యంగా లోకల్ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా కవర్ చేస్తుంటుంది. భాస్కర్ (సంజయ్ మిశ్రా) ఆమె దగ్గర కెమెరామెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంటాడు. మునావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అనాథ అమ్మాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక షెల్టర్​ హోం నడుపుతుంటుంది. అందులో ఉంటున్న ఆడపిల్లలపై లైంగిక దాడులు జరుగుతుంటాయి. ఈ విషయాన్ని ఆ ఊరి వాళ్లు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులకు చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం.. ఆ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) అనే వ్యక్తి మెయింటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడమే. స్థానిక రాజకీయ నాయకులతో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే అధికారులు, పోలీసులు పట్టించుకోరు. అదే టైంలో అక్కడ జరుగుతున్న దారుణాల గురించి వైశాలికి తెలుస్తుంది. ఆమె ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా బయటపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది.  కథ నెమ్మదిగా సాగుతుంది. జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైశాలిగా భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ పాత్రలో ఒదిగిపోయింది.

పిల్లల్ని కాపాడేందుకు..

టైటిల్ :  ఆర్య సీజన్ 3 : అంతిమ్ వార్

డైరెక్షన్​ : రామ్ మధ్వానీ, సందీప్ మోదీ, 

వినోద్ రావత్ ; కాస్ట్ : సుస్మితా సేన్, ఐలా అర్జున్, అరుషీ బజాజ్, విరేన్ వజిరాణి, ప్రత్యక్ష్ పన్వర్, వికాస్ కుమార్, గీతాంజలి కులకర్ణి 

లాంగ్వేజ్ : హిందీ

ప్లాట్​ ఫాం : డిస్నీ + హాట్‍స్టార్

ఆర్య సరీన్ (సుస్మితా సేన్) భర్త తేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ మాఫియాలో పనిచేస్తుండేవాడు. కానీ.. అతను చనిపోవడంతో ఆర్య ప్రమాదంలో పడుతుంది. తనను, తన పిల్లలను మాఫియా నుంచి కాపాడుకునేందుకు గ్యాంగ్‍స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. పిల్లల ప్రాణాలను తీసేందుకు వచ్చే వాళ్లను ఎదుర్కొంటుంది. తన గ్యాంగ్‍లోని చాలామంది ఆమెని మోసం చేసినా వెనుకడుగు వేయకుండా పోరాడుతుంది. ఆ పోరాటంలో తన పిల్లల్ని ఎలా కాపాడుకుంది? ఆమెకు సాయం చేసిందెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? ఆర్య ఫస్ట్ సీజన్, రెండో సీజన్ స్టోరీలు చాలా ఉత్కంఠగా ఉంటాయి. కానీ.. మూడో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భార్య, తల్లిగా ఉండే ఆర్య గ్యాంగ్‍స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి, పోరాడడం పెద్ద ట్విస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సుస్మితా సేన్ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగుంది. యాక్షన్ సీన్లలో కూడా చాలా బాగా చేసింది.