రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై తండ్రి, కొడుకు ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది.  అంక్సాపూర్ NH-63వ జాతీయ రహదారిపై.. రోడ్డు పక్కకు ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పిఢీకొనడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే చనిపోయారు.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  

మృతులు మోర్తాడ్ మండలం  దొన్కల్ గ్రామానికి చెందిన తండ్రి శివరాజ్, కొడుకు రవీందర్ గా పోలీసులు గుర్తించారు.  ఈ ప్రమాంపై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.