మూడు విడతల్లో 2.33 లక్షల మంది రైతులకు రుణమాఫీ

  • ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1843 కోట్లు లబ్ధి
  • రుణ విముక్తులైన  రైతుల్లో సంబురాలు
  • మాఫీ కాని వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్న అధికారులు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో సంతోషం నెలకొంది.‌‌‌‌‌‌‌‌ మూడు విడతల్లో రూ.2లక్షల్లోపు మూడు విడుతల్లో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 2,33,608 మంది రైతులకు రుణమాఫీ కాగా, వారికి రూ.1,843 కోట్లు లబ్ధి చేకూరింది.

 కరీంనగర్ జిల్లాలో 66,567 మంది రైతులకు రూ.512.32 కోట్లు మాఫీ కాగా, జగిత్యాల జిల్లాలో 72,651 మంది రైతులకు రూ.548.34 కోట్ల క్రాప్ లో‌‌‌‌‌‌‌‌న్ మాఫీ అయింది.‌‌‌‌‌‌‌‌ పెద్దపల్లి జిల్లాలో 51,230 మంది రైతులకు రూ.373.6 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43,376 మంది రైతులకు 408.93 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,33,824  మంది రైతులకు 1843.19 కోట్లు లబ్ధి చేకూరింది. 

నెరవేరిన ఎన్నికల హామీ.. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే క్రాప్ లోన్లను ఆగస్టు 15లోపు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు తీసుకున్న ‌‌‌‌‌‌‌‌రుణాలను మాఫీ చేస్తామని కటాఫ్ విధించారు. ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 1,28,762 మంది రైతుల ఖాతాల్లో  జులై 18న రూ.710.29 కోట్లను జమచేసింది. జులై 30న రెండో విడతలో రూ.లక్షన్నర లోపున్న 63,286 ఖాతాల్లో రూ. 580.71 కోట్లు మాఫీ చేయగా, తాజాగా మూడో విడతలో రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న 41,777 ఖాతాల్లో  రూ.552.19 కోట్లు మాఫీ చేసింది.‌‌‌‌‌‌‌‌

మాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు

వివిధ సాంకేతిక ‌‌‌‌‌‌‌‌సమస్యలతో కొందరు‌‌‌‌‌‌‌‌రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాంటి వాళ్ల నుంచి ఇప్పటికే మండలాల్లోని అగ్రికల్చర్​ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించింది. రేషన్ కార్డులో పేరులేని రైతులు, రేషన్ కార్డులో పేరు ఉండి ఆధార్ లింక్ కానివాళ్లు,  క్రాప్​ లోన్​ తీసుకున్న రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసుబుక్​ లేనివాళ్లు,  క్రాప్​లోన్ అకౌంట్, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నవాళ్లు, పేర్లలో, ఆధార్​, పాస్​బుక్​ నంబర్లలో తప్పొప్పుల కారణంగా రుణమాఫీ కానివాళ్లు సరైన ఆధారాలతో దరఖాస్తు చేస్తే వాటిని పరిష్కరించి, రుణమాఫీ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమచేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి రైతుల నుంచి మండలాల్లో ఏవో, ఏఈవోలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీరందరికి‌‌‌‌‌‌‌‌ఈ నెలఖారులోగా రుణమాఫీ అవుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.‌‌‌‌‌‌‌‌

కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటా

నేను 2014లో రూ.1.80లక్షలు క్రాప్ లోన్ తీసుకున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయిందని మెసేజ్ వచ్చినా మాఫీ మాత్రం కాలేదు. అకౌంటు ఫ్రీజ్ అయిందని డబ్బులు పడలేదని బ్యాంక్ అధికారులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ మూడో విడతలో రూ.1.92లక్షలు మాఫీ అయింది. పంట పెట్టుబడులకు మల్లా రుణం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుంది. 

- బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు, కాసింపేట, గన్నేరువరం