పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం రూ. 5 లక్షల విరాళం

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు రైతు సంఘం కీర్తి కిసాన్ యూనియన్ గురువారం తన మిషన్ ద్వారా మానవతా సహాయంగా రూ.5 లక్షల విరాళాన్ని అందజేసింది. యూనియన్ ప్రతినిధి బృందం భారతదేశంలోని పాలస్తీనా రాయబారి అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్‌‌ను ఇక్కడి పాలస్తీనా రాయబార కార్యాలయంలో కలిసి డబ్బును అందించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం యూనియన్ అధ్యక్షుడు నిర్భాయ్ సింగ్ ధుడికే మీడియాతో మాట్లాడారు.

మానవ నాగరికత చరిత్రలో ఇది చీకటి అధ్యాయమని, అత్యంత భయంకరమైన మారణహోమం అన్నారు. ఇజ్రాయెల్, అమెరికా వంటి ప్రధాన శక్తుల ప్రేరేపణతోనే ఇది జరుగుతోందని విమర్శించారు. ఇందులో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పాలస్తీనా సమస్యకు యూఎన్​ స్థిరమైన పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు.