లింగంపేట మండలంలో దంచికొట్టిన వాన..తడిసిన వడ్లు

లింగంపేట, వెలుగు : మండలంలోని భవానీపేట, కొండాపూర్, ముంబాజీపేట, జల్దిపల్లి, మెంగారం, లింగంపేట, బోనాల్, పోల్కంపేట, పోతాయిపల్లి, శెట్పల్లి సంగారెడ్డి, మాలపాటి, శెట్పల్లి తదితర గ్రామాలలో గురువారం తెల్లవారు జామున 3 నుంచి 5 గంటలవరకు వర్షం కురిసింది.  దీంతో కల్లాలలో ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి.  

సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా వాటిని ప్రారంభించకపోవడంతో  వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ధాన్యాన్ని తూకం వేసి వెంటవెంటనే రైస్​మిల్లులకు తరలించాలని రైతులు  కోరుతున్నారు.