వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

కామారెడ్డి, వెలుగు : వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నిజాంసాగర్​, బీబీపేట మండల కేంద్రాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిజాంసాగర్​ మండలం మాగి కొనుగోలు సెంటర్ లో  కాంటాలు పెట్టినప్పటికీ వడ్లను లోడింగ్​ చేసి, మిల్లులకు తరలించడం లేదని  ఆందోళనకు దిగారు. బస్తాకు  మూడు కిలోలు అదనంగా తరుగు తీస్తున్నారని ఆరోపించారు.  రైతుల వద్దకు తహసీల్దార్​, ఎస్సై వెళ్లి మాట్లాడారు.

 సజావుగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  బీబీపేట మండలం మల్కాపూర్​లో మూడు రోజులుగా కాంటాలు చేయడం లేదని రైతులు మండల కేంద్రానికి తరలివచ్చి రాస్తారోకో చేశారు.  డీసీఎంఎస్​ చైర్మన్​ ఇంద్రసేనారె డ్డి వెళ్లి రైతులతో మాట్లాడారు. కాంటాలు చేయిస్తానని హామీనివ్వడంతో రైతులు ఆందోళన 
విరమించారు.