మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రైతుల మహాధర్నా

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గురువారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. వందలాది మంది రైతులు హైవే 63పై పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నికలకు ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి రైతులు పండించిన ప్రతి గింజను 

రూ.500 బోనస్ ఇస్తామని, ప్రతి ఎకరాకు రూ.7500 రైతు భరోసా ఇస్తామని, ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసి అధికారంలోకి రాగానే మోసం చేశారని ఆరోపించారు. షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ రైతు సంఘాల నాయకులు, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు.