మోర్తాడ్‌‌‌‌ లో రైతుల ధర్నా

బాల్కొండ, వెలుగు :  63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ లో రైతులు గురువారం మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రాణాలైనా అర్పిస్తాం భూములు ఇవ్వమని నినాదాలు చేశారు. ఇది వరకే వరద కాలువ, రైల్వే లైన్ కోసం విలువైన భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పంటలు పండే పంట భూములను ప్రభుత్వాలు కాపాడాలని విన్నవించారు.