రుణమాఫీ..  అన్నదాత ఫుల్​ ఖుషీ

  • ఊరూరా ర్యాలీలు, సీఎం ఫొటోలకు క్షీరాభిషేకాలు

రైతు రుణమాఫీతో ఉమ్మడి పాలమూరులో గురువారం సందడి నెలకొంది. ఆయా మండలాల్లోని రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రైతులు భారీగా తరలివచ్చారు. సెక్రటేరియట్​ నుంచి సీఎం రేవంత్​ రెడ్డి స్పీచ్​ను ఎల్​ఈడీ స్క్రీన్​ల ద్వారా వీక్షించారు. అంతకుముందు ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు బైక్​ ర్యాలీలు నిర్వహించి  సీఎం ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు.

వెలుగు, నెట్​వర్క్​

కొండగల్​ ఎక్కడుంది లక్ష్మీ?

ధన్వాడ మండలానికి చెందిన మహిళా రైతు కుర్వ లక్ష్మీని వీసీలో సీఎం రేవంత్​ రెడ్డి పలకరించారు. ఎంత భూమి ఉంది? సాగు చేస్తున్నావా? అని సీఎం ప్రశ్నించగా,  తనకు నాలుగెకరాల భూమి ఉందని, మూడు ఎకరాల్లో పత్తి, ఎకరాలో వరి వేసినట్లు ఆమె వివరించారు. తనకు రూ.78 వేల లోన్​మాఫీ కానున్నట్లు తెలిపింది. ఇందుకు స్పందించిన సీఎం.. ‘మీ కోసం పని చేస్తున్నాం. దీనిని మీరు గుర్తించాలి. మీ ఎమ్మెల్యే పర్ఱికా రెడ్డిని మంచిగా చూసుకోవాలి’ అని అన్నారు. అలాగే కొడంగల్ ఎక్కడుందని లక్ష్మీని ప్రశ్నించగా, నారాయణపేట జిల్లాలోని ఉందని ఆమె సమాధానం చెప్పారు.

రాములమ్మతో ముచ్చట

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన వసంతపురం రాములమ్మతోనూ సీఎం మాట్లాడారు. తన రూ.50 వేల రుణాన్ని మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు ఉన్న ఒక ఎకరం పొలంలో వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు  చెప్పారు.

అసెంబ్లీల వారీగా రుణమాఫీ వివరాలు

అసెంబ్లీ    అకౌంట్స్    కుటుంబాలు     మాఫీ మొత్తం
మహబూబ్ నగర్    5,829     5,586     రూ.30.85 కోట్లు 
జడ్చర్ల    14,349    13.663     రూ.80.09 కోట్లు 
దేవరకద్ర    17.239    16.427    రూ.98.37 కోట్లు 
వనపర్తి    16,071    15,180    రూ.83.84 కోట్లు
నారాయణ పేట    14,774..    14.004..    రూ.82.24 కోట్లు 
మక్తల్    12.107    11.658..    రూ.72.75 కోట్లు 
కొడంగల్    17.975    11.658    రూ.72.75 కోట్లు 
గద్వాల    10,099    16,989..    రూ.99.84 కోట్లు 
అలంపూర్    14,299    13,799    రూ.82.81 కోట్లు
నాగర్ కర్నూల్...    14,348    13610    రూ.81.75 కోట్లు..
అచ్చంపేట    15,990    15,112    రూ.92.44 కోట్లు..
కల్వకుర్తి    18,196    17,270    రూ.103.02 కోట్లు 
కొల్లాపూర్    16,982    15,998    రూ.91.58 కోట్లు