సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

మెట్ పల్లి, వెలుగు: అంతరాయం లేకుండా కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై చేయాలని ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట రైతులు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ ఎదుట శుక్రవారం బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సప్లైలో హెచ్చు తగ్గులు ఉండడంతో మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, ఫ్యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోతే వేయడానికి డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. అనంతరం డీఈకి వినతిపత్రం అందజేశారు.