సెక్రటరీని బదిలీ చేయాలని డిమాండ్

బీర్కూర్, వెలుగు : సెక్రటరీ పనితీరు బాగాలేదని, అతడిని బదిలీ చేయాలని కామారెడ్డి జిల్లా బీర్కూర్​ సొసైటీ పరిధిలోని రైతులు డిమాండ్​ చేశారు. గురువారం బీర్కూర్​ సొసైటీ మహాజన సభ నిర్వహించారు.  సెక్రటరీ ఆదాయ వ్యయాలు వివరాలు చదువుతుండగా రైతులు కలుగచేసుకొని అతనితో వాగ్వాదానికి దిగారు. ప్రతీసారి జమ ఖర్చులు సక్రమంగా చెప్పడం లేదని ఆరోపించారు.  

ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట అన్యాయం జరుగుతుందని,  వెంటనే సెక్రటరీని బదిలీ చేయలన్నారు. అలాగే నస్రుల్లాబాద్​ మండలం దుర్కి సొసైటీ మహాజన సభ జరిగింది. సమావేశంలో పలువురు రైతులు మాట్లాడారు. రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. సమావేశంలో చైర్మన్లు గాంధీ, శ్రీనివాస్​ యాదవ్​, సెక్రటరీలు గంగారాం, విఠల్​, పాలక వర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.