గాయత్రి షుగర్స్ ఏఓను అడ్డుకున్న రైతులు

సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండల కేంద్రంలో గురువారం గాయత్రి షుగర్స్ ఏఓ రమేశ్ ను రైతులు అడ్డుకున్నారు.  రైతులతో కలిసి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్​రావు మాట్లాడుతూ.. రైతుల పేరిట గాయత్రి యాజమాన్యం రుణాలు తీసుకుని రుణమాఫీ రాకుండా చేసిందని ఏఓను నిలదీశారు.  దీంతో ఏఓ రమేశ్ వెంటనే గాయత్రి షుగర్స్‌‌‌‌‌‌‌‌ వైస్​ ప్రెసిడెంట్​ వేణుగోపాల్​రావుతో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడించారు.

 ఈ సందర్భంగా వేణుగోపాల్​రావు మాట్లాడుతూ..  రైతుల పేరిట మాపీ ఆయిన రుణాలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పూర్తి బాధ్యత తమదేనన్నారు. దీంతో రైతులు ఏవో రమేశ్‌‌‌‌‌‌‌‌ను విడిచిపెట్టారు. కార్యక్రమంలో మండల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, కలాలీ చుక్క సాయాగౌడ్ తదితరులు 
పాల్గొన్నారు.