కామారెడ్డి జిల్లాలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన

కామారెడ్డిటౌన్​ ​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  గురువారం రైతులు ఆందోళనకు దిగారు.  గాంధీ గంజు మార్కెట్​యార్డులో ఆరబోసిన వడ్లు అకాల వర్షానికి తడిసిపోయాయని తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని  రాస్తారోకో చేశారు. యార్డులో టార్ఫాలిన్లు ఇవ్వటం లేదని, హామాలీల కొరత ఉందనికాంట పెట్టడంతో ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లతో  మాట్లాడించారు. తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని, హామాలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు  ఆందోళన విరమించారు.