మెట్ పల్లి, వెలుగు: హైవే 63 బైపాస్ నిర్మాణంలో కోల్పోతున్న భూములకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రేటు చెల్లించాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావుతో కలిసి రైతులు కలెక్టర్ బి.సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బైపాస్ నిర్మాణంతో విలువైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జువ్వాడి మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. బండలింగపూర్, మేడిపల్లి, వెల్లుల్ల గ్రామాల రైతులు పాల్గొన్నారు..
కోరుట్ల రూరల్, వెలుగు: కోరుట్ల మండలం జోగన్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. లీడర్లు మహిపాల్ రెడ్డి, రాజం, అంజిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.