సదాశివనగర్, వెలుగు: రెవెన్యూ అధికారులు వారసత్వ పట్టా చేయడం లేదని మాజీ సర్పంచ్ తహశీల్దార్ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు మంత్రి భగవాన్ తన తండ్రి మొగులయ్య పేరిట ఉన్న పట్టా భూమిలో(సర్వే నంబర్ 856/68) ఒక ఎకరం వారసత్వ పట్టా చేయాలని తహశీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకుని కొంతకాలంగా తిరుగుతుండగా అధికారులు పట్టించుకోవడంలేదు.
దీంతో మంగళవారం భగవాన్ ఆఫీసు ముందు పురుగుల మందు తాగి చనిపోయేందుకు యత్నిస్తుండగా.. రెవెన్యూ సిబ్బంది చూసి డబ్బా లాక్కొని దవాఖానకు తరలించారు. వారసత్వ పట్టా చేయాలని రెవెన్యూ ఆఫీసర్లు కోరుతుండగా చేయట్లేదని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్టు బాధితుడు తెలిపాడు. ఘటనపై స్పందిస్తూ భగవాన్‌కు చెందిన భూమిని పరిశీలించి వారసత్వ భూమి అయితే పట్టా మార్పిడి చేస్తామని తహశీల్దార్వివరణ ఇచ్చాడు.