అప్పుల బాధతో యువ రైతు సూసైడ్

  • కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘటన 

జమ్మికుంట, వెలుగు :  భూమికి కౌలుకు తీసుకుని పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.  బాధిత కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన చల్లా శివసాగర్(23) తండ్రి మూగ, కుంటివాడు కావడంతో ఇంటి బాధ్యతంతా తనపైనే పడింది. గ్రామంలో 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. 

పంట పెట్టుబడికి  రూ.5 లక్షల అప్పు చేశారు. దిగుబడిస్తే సరిగా రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక  తీవ్ర మస్తాపానికి గురైన శివసాగర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.