టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు : రైతు బిడ్డ తయారు చేసిన యాప్ ఇది

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూజ్ జిల్లా పాథా ఊరికి చెందిన అమ్మాయి నందిని. పద్నాలుగేండ్లు ఉంటాయి. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ లో తొమ్మిదో క్లాస్ చదువుతోంది తండ్రి రైతు. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం నందినికి. వీళ్ల స్కూల్ నుంచి 'రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్' అనే ప్రాజెక్ట్ ద్వారా టీచర్లతో కలిసి పిల్లలంతా ఏఐ వెబ్ సైట్ ని తయారుచేశారు. దానినుంచి ఇన్ స్పైర్ అయింది. ఆమె డెడికేషన్ చూసిన ఇంటెల్ ల్యాప్టాప్ కంపెనీ నందినికి కొత్త ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది నందినికి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదే నమ్మకంతో కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. 

ఆటైంలో రైతులు సాయిల్ టెస్టింగ్ కోసం మాట్లాడుకోవడం విన్నది. ఎప్పుడూ వాళ్లు అగ్రికల్చర్ ఆఫీసు వెళ్లి సాయిల్ టెస్టింగ్ కోసం వాళ్లు పడే ఇబ్బంది, నేల నాణ్యత తెలుసుకోకుండా పంటలు వేసి కొందరు రైతులు నష్టపోవడం గమనించింది. రైతుల కోసం స్కూల్లో డిజైన్ చేసిన వెబ్ సైట్ మాదిరిగా ఫోన్ యాపతయారు చేయాలను కుంది. అందుకు మాథ్స్ టీచర్ సాయం తీసుకుంది. తన ప్రాజెక్ట్ కు 'మిట్టికో జానో, ఫసల్ పెహచానో' అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ యాప్ ను తయారుచేసింది. 

మట్టిలోని టెంపరేచర్, నైట్రోజన్ విలువలను తెలుసుకొని, దానికి తగ్గ పంటను ఈ యాప్ సూచిస్తుంది. స్మార్ట్ డేటా ఆధారంగా ఇది పని చేస్తుంది. రైతులు కూడా ఈ యాప్ ని ఈజీగా వాడొచ్చు. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ ను ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించింది. దానికి చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్ పాండే ఫిదా అయ్యారు. 'జిల్లాతో పాటు రాష్ట్రంలోని విద్యార్థులందరినీ ఇది చాలా ఇన్ స్పైర్ చేస్తుంది. రైతులకు ఎంతో ఉపయోగం' అని అన్నారాయన. ఈ ఎగ్జిబిషన్ లో యూపీ నుంచి పాల్గొన్న ఏకైక అమ్మాయి నందిని కావడం విశేషం.