చండూరు, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ చండూరు మండలం శిర్డేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని లింగోజు కిరణ్ కుమార్ పాదయాత్ర చేపట్టాడు.
శనివారం శైవ క్షేత్రమైన చెరువుగట్టు నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు అభిమాని పాదయాత్ర ప్రారంభించాడు. మున్ననూర్ గేటు వద్ద అతడిని చండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు కలిసి పండ్లు పంపిణీ అందజేశారు.