వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి

  • 17వ  బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్
  • సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన

రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని 17వ బెటాలియన్ పోలీస్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఓవర్ టైం డ్యూటీలతో కన్నబిడ్డలకు, తల్లిదండ్రులతో గడపకుండా చేస్తున్నారని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో 17 వ బెటాలియన్ పోలీస్ భార్యలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..   నెలలో రెండు మూడు రోజులు కూడా తమతో భర్తలు ఉండటం లేదని వాపోయారు. 

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా వన్ స్టేట్ వన్ పోలీస్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. 17వ బెటాలియన్ లో తమ భర్తలతో కూలీ పనులు చేయిస్తున్నారని  ఆరోపించారు. నిరసన చేస్తున్న పోలీస్ కుటుంబ సభ్యులు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.