ఈ మధ్య కాలంలో కల్తీ సరుకేదో, అసలు సరుకేదో, నకిలీ సరుకేదో గుర్తించలేనంతగా పాకిపోయింది కల్తీ, నకిలీ దందా. పాల దగ్గర నుండి నూనె వరకు ప్రతీది నకిలీ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. తరచూ ఎదో ఒక వస్తువు కల్తీ చేసిన ఘటన కానీ, అసలుకు బదులు నకిలీ వస్తువులు అమ్మటం కానీ చూస్తూనే ఉన్నాం. ఈ కల్తీ మరియు నకిలీ వస్తువుల వల్ల మన జేబులకు చిల్లు పడటమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది. తాజాగా నకిలీ పన్నీర్ వెలుగులోకి వచ్చింది.
పన్నీర్ చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్, ముఖ్యంగా వెజిటేరియన్స్ పన్నీర్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది డైట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, పన్నీర్ ప్లేస్ లో సింథటిక్ పన్నీర్ అమ్ముతున్నారు మార్కెట్లో. ముంబై, ఢిల్లీలో నకిలీ పన్నీర్ గుర్తించిన అధికారులు 1300కేజీల సింథటిక్ పన్నీర్ ని సీజ్ చేసారు.
నకిలీ పన్నీర్ ని గుర్తించటం ఎలా:
రంగు: అసలు పన్నీర్ అయితే వేడి చేస్తే బ్రౌన్ కలర్ లోకి మారుతుంది.నకిలీ పన్నీర్ వేడి చేస్తే రబ్బర్ లాగా సాగుతుంది.
వాసన: అసలు పన్నీర్ అయితే, పాల వాసన వస్తుంది. నకిలీ పన్నీర్ ఆర్టిఫీషియల్ స్మెల్ వస్తుంది.
తేమ శాతం: అసలు పన్నీర్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. నకిలీ పన్నీర్లో తేమ శాతం లేకుండా పొడిగా ఉంటుంది.
నకిలీ పన్నీర్ తినటం వల్ల స్టమక్ అప్సెట్ అవ్వటం, వాంతులు అవ్వటం జరుగుతుంది. నకిలీ పన్నీర్ బారిన పడకుండా ఉండాలంటే కొనేటప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్స్ కొనటం, క్వాలిటీ సర్టిఫికెట్ చూసి కొనటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.